నార్సింగీ లో దారీ దోపిడీ, హత్య కేసు లో పురోగతి.
కిషోర్ కుమార్ రెడ్డి ని హత్య చేసిన చింటూ సింగ్ ను పట్టుకున్న నార్సింగీ పోలీసులు.
ఇప్పటికీ రౌడీ షీటర్ కరణ్ సింగ్ ను అరెస్ట్ చేసిన కాప్స్.
గత నాలుగు రోజుల నుండి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొని తిరుగుతున్న చింటూ సింగ్.
చింటూ సింగ్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులు.
చింటూ సింగ్గ గతంలో కేసుల నమోదు పై ఆరా.
ఇంకా విషమంగానే కానిస్టేబుల్ రాజు నాయక్ పరిస్థితి.
***********************
వెనుకబడిన ప్రాంతాలకు మరోసారి అన్యాయం చేయవద్దు
విశాఖకు కేఆర్ఎంబీ కార్యాలయాన్ని తరలించడం ఎంతవరకు సబబు
కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన సెల్ఫీలకే : బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
హైదరాబాద్ : కృష్ణా నదిపై బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మిస్తే రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కేఆర్ఎంబీ ఛైర్మన్‌ను ఆయన కలిశారు. వెనుకబడిన ప్రాంతాలకు మరోసారి అన్యాయం చేయొద్దని కోరారు. కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మిస్తే అది సెల్ఫీలకు మాత్రమే పనికొస్తుందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దాని స్థానంలో బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మిస్తే రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఈ విషయమైన హైదరాబాద్‌లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌ను బైరెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన ప్రాంతాలకు మరోసారి అన్యాయం చేయొద్దని బైరెడ్డి కోరారు. తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. కృష్ణా నదిపై వంతెన నిర్మించాలనే డిమాండ్‌తో ఈనెల 28న చలో సిద్దేశ్వరం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కృష్ణా నదితో ఏమాత్రం సంబంధం లేని విశాఖకు కేఆర్ఎంబీ కార్యాలయాన్ని తరలించడం ఎంతవరకు సబబని బైరెడ్డి ప్రశ్నించారు. దాన్ని కర్నూలుకు తరలించాలని ఆయన డిమాండ్‌చేశారు.
వ్యాపారాలు ఉన్నవారిని బెదిరిస్తున్నారు : మరోవైపు భారాసపై బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి విమర్శలు చేశారు. భారాసలో చేరాలంటూ హైదరాబాద్‌లో వ్యాపారాలు ఉన్నవారిని ఆ పార్టీ నేతలు బెదిరిస్తున్నారని, అలాంటి వారే అందులో చేరి కండువా కప్పుకొంటున్నారని చెప్పారు. ఏపీ భారాస అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా అలానే చేరినట్లున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీని బాగుచేస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారని, తెలంగాణలో పరిస్థితి ఏమైనా బాగుందా? అని బైరెడ్డి ప్రశ్నించారు.
*******************
రంగారెడ్డి:……..
రాజేంద్రనగర్ లో లారీ బీభత్సం.
హైదర్ గూడ చౌరస్తా వద్ద పాద చారుల పై దూసుకెళ్లిన లారీ.
బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తల ను ఢి కొట్టిన లారీ. లారీ చక్రాల కింద నలిగిపోయిన భర్త. లారీ కింద నుండి భార్యను లాగేసిన స్థానికులు.
తప్పిన పెను ప్రమాదం. రోడ్డు ప్రమాదం తో ఉలిక్కి పడ్డ రోడ్డు పై ఉన్న ప్రజలు.
100 ఫొన్ చేసి సమాచారం ఇచ్చిన స్థానికులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అంటున్న కాప్స్. ఆర్టీసీ బస్సు, లారీ ఓవర్ టేక్ చేయడం తో పాదచారుల పైకి దూసుకొని వచ్చిన లారీ అంటున్న స్థానికులు.
భార్య కళ్ల ముందు కొట్టు మిట్టులాడుతూ ప్రాణాలు విడిచిన భర్త. తీవ్రంగా గాయపడ్డ భార్య.
కర్ణాటక ప్రాంతానికి చెందిన రత్తయ్య, మంజుల. పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ కు వచ్చిన దంపతులు.
లారీ రూపంలో దూసుకొని వచ్చిన ప్రమాదం.
***********************
నాంపల్లి క్రిమినల్ కోర్ట్/జనవరి9.
నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గణపతి గారి పైన నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమాకేసును బుక్ చేయినందుకు నిరసనగా ఈరోజు నాంపల్లి క్రిమినల్ కోర్ట్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జస్పాల్ సింగ్,ఉపాక్షుడు రాంచరణ్,లిబ్రేరియన్ పద్మావతి,జాయింట్ సెక్రటరీ అవినాష్, మరియు సభ్యులు న్యాయవాదులు తిరుపతి వర్మ,జక్కుల లక్ష్మణ్,వెంకట్ యాదవ్,వినయ్ పాల్ సింగ్,ఖాదీర్ ,రఘు,అసద్,రమేష్,నరేష్,ఉమ,తదితరులు పాల్గొన్నారు.
****************
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో కదిలిన జిల్లా యంత్రాంగం…
సంగారెడ్డి జిల్లా :గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో 261 సర్వే నంబర్ లోని భూమి అన్యాక్రాంతమైందన్న ఫిర్యాదు తో కదిలిన జిల్లా యంత్రాంగం
అన్నారం గ్రామ రైతులతో జిల్లా అధికారుల సమావేశం
జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, డీఎల్ పీఓ సతీష్ రెడ్డి, తహశీల్దార్ సుజాత
సర్వేయర్లతో ఈ రోజు నుంచే సర్వే చేయించి రెండు రోజుల్లో సర్వే రిపోర్టును కలెక్టర్ కు అందజేస్తాం
సర్వేకు సహకరించాలని రైతులకు విజ్ఞప్తి
118 మందికి త్వరలో ఆన్ లైన్ పట్టా సర్టిఫికేట్లను అందజేస్తామని హామీ ఇచ్చిన అధికారులు.