నిలి గగన్ కె తలే..
రసికొ ప్యార్ ఛలో..
నిన్ను అందమైన ప్రపంచంలోకి
తీసుకువెళ్ళే ఆ గొంతు..
అచ్చం రఫీలా..
ఎంతో సాఫీగా..
పొద్దున్నే తాగే కాఫీలా..!
అమృతం ఒలికే గళంతో
అమృత్ సర్లో పుట్టిన
మహేంద్రకపూర్..
మొహమ్మద్ రఫీ పాటలు
వినీవినీ ఆయనలా పాడాలని తలచి…
ఆయన గొంతునే వలచి
ఎక్కేసాడు బొంబాయి రైలు..
వెదజల్లేసాడు కొన్ని వేల
పాటల పూలు..!
మహేంద్ర కపూర్ (ఆంగ్లం :Mahendra Kapoor) (జనవరి 9, 1934, అమృత్‌సర్, పంజాబ్ – సెప్టెంబరు 27 2008, ఒక భారతీయ నేపథ్య గాయకుడు
🌷జయంతి🌷