బంగారం కాదు, మాదక ద్రవ్యాలు లేదా మత్తు పదార్ధాలు మరీ ఏమి కావు. స్వదేశంలో పెరుగుతున్న ధరల కారణాన చౌకగా గల్ఫ్ నుండి తినడానికి సాధారణ ఉల్లిగడ్డలను గల్ఫ్ నుండి తీసుకోవెళ్ళినందుకు ఫిలిఫీన్స్ ఏయిర్ లైన్స్ ఏయిర్ హోస్టెస్ స్మగ్లింగ్ కేసును ఎదుర్కోంటున్నారు.
గల్ఫ్ లోని రియాధ్, దుబాయి నగరాల నుండి ఫిలిఫీన్స్ రాజధాని మనీలాకు ఉల్లిగడ్డలు, నిమ్మకాయలతో పాటు కొన్ని పళ్ళు తీసుకోవచ్చినందుకు కస్టం అధికారులు ఫిలిఫీన్స్ ఏయిర్ లైన్సు ఏయిర్ హోస్టేస్ మరియు ఇతర సిబ్బందిపై కేసును నమోదు చేసారు.
మాంసం, చికెన్ ధరల కంటె ఎక్కువగా ఉల్లి ధరలు ఉండడంతో గల్ఫ్ దేశాలలో చౌకగా లభించె భారత, యమన్ దేశాల ఉల్లిగడ్డలను ఫిలిపీన్స్ ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో స్వదేశానికి తీసుకెళ్తున్నారు, అందుకు విమానాల సిబ్బంది కూడ మినహాయింపు ఏమి కాదు. దుబాయిలో రెండున్నర దిర్హాంలకు లభించె ఉల్లి ఫిలిపీన్స్ దేశంలో 40 దిర్హాంలకు లభిస్తుంది. వరదల కారణాన ఉల్లి పంటలన్ని ధ్వంసం కావడంతో ధరలు అనూహ్యంగా పెరగడంతో అధ్యక్షుడు, పార్లమెంటుతో సహా యావత్తు దేశం ఆందోళన చెందుతుంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాలలోని ఫిలిపీన్స్ ప్రవాసీయులు విలువయిన బహుమతులకు బదులుగా ఉల్లిగడ్డలను తీసుకెళ్తున్నారు. కస్టం అధికారులు ఉల్లిగడ్డల స్మగ్లింగ్ ను అరికట్టడానికి తీవ్ర కసరత్తు చేస్తున్నారు.