*ఈ మధ్య గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీలో మరణించిన వారి కుటుంబాలకు మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,00,000(పది లక్షల రూపాయలు) అందజేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ మాజీ అధ్యక్షుడు, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహనకృష్ణ . మరణించిన వారి ఒక్కొక్క కుటుంబానికి 3,34,000(మూడు లక్షల మూఫై నాలుగు వేల రూపాయలు) మొత్తం మూడు కుటుంబాలకు కలిపి 10,00,000( పది లక్షల రూపాయలు) మన్నవ మోహనకృష్ణ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మాకినేని పెద్ద రతయ్య, ఆలపాటి రాజా, నక్కా ఆనంద బాబు, గుంటూరు పశ్చిమ ఇంచార్జి కోవెలమూడి రవీంద్ర,
గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, రాష్ట్ర కార్యదర్శి
కనపర్తి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, భవిష్యత్తులోనూ వారి కుటుంబానికి మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండగా ఉంటామని మన్నవ మోహనకృష్ణ హామీ ఇచ్చారు.