పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అయితేనే తేదేపా-జనసేన పొత్తుకు మద్దతు :- కాపు నాడు సీనియర్ నేత హరి రామ జోగయ్య బహిరంగ లేఖ……
2024 సం॥రం ఎన్నికలలో వై.ఎస్.ఆర్. పార్టీని ఓడించాలంటే తెలుగుదేశం – జనసేన పొత్తు.
ఉండవలసిందే-ఇదే కాపు సంక్షేమ సేన ఆకాంక్ష. అయితే ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ గారు ఉండవలసిందే.
ఇది కాపు సంక్షేమ సేన డిమాండు.
కాపు సంక్షేమ సేన ఆవిర్భవించిందే రెండు ఆశయాలను నెరవేర్చుటకొరకు, అవే విద్యా, ఉద్యోగాలలో
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తులకు ప్రస్తుతం బి.సి.లుగా ఉన్న సామాజికవర్గాలకు ఎటువంటి నష్టం
కలుగకుండా రిజర్వేషన్స్ దక్కించుకొనుటకు మొదటిది అయితే రాష్ట్ర జనాభాలో 22 శాతం జనాభా ఉన్న
కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలనేది. అంటే ముఖ్యమంత్రి దక్కాలనేది. రెండవది విద్యా,
ఉద్యోగాలలో రిజర్వేషన్స్ దక్కించుకోవటమే ధ్యేయంగా అనేక ఉద్యమాలు, దీక్షలు చేస్తూ వస్తోంది కాపు
సంక్షేమసేన. త్వరలో న్యాయస్థానం తలుపులు తట్టబోతుంది. ఈ డిమాండు సాధించుకొనుటకు కాపు
కులస్తులను ఎవరికీ తాకట్టు పెట్టకూడదనేదే కాపు సంక్షేమ సేన విధి విధానాలు.
ఇక రెండవది కాపు కులస్తులకు ముఖ్యమంత్రి పదవి దక్కటం, పరిపాలన చేబట్టటం, బడుగు
బలహీనవర్గాల సంక్షేమం కోరి ప్రజారాజ్యం ఏర్పాటు చేయటం. బడుగు బలహీనవర్గాలను అధికారంలో
భాగస్వాములను చేయటం. ఈ కోరికను సాధించటమే ధ్యేయంగా జనసేనపార్టీకి కాపు సంక్షేమసేనను
అనుబంధంగా తీర్చిదిద్దటం జరిగింది. పవన్ కల్యాణ్‌ని ముఖ్యమంత్రిగా చేయటమే కాపు సంక్షేమ సేన
Ultimate Aim.
రాక్షసపరిపాలన, అభివృద్ధిరహిత పరిపాలన, అవినీతి పరిపాలన సాగిస్తున్న వై.ఎస్.ఆర్. పార్టీ అధినేతను
రాబోయే ఎన్నికలలో ఓడించటము మాత్రమే కాదు జనసేన Ultimate Aim. పవన్ కల్యాణ్‌ని ముఖ్యమంత్రిని
చేయటం ద్వారా బడుగు బలహీన వర్గాల రాజ్యం ఏర్పాటు చేయటమే కాపు సంక్షేమ సేన ముఖ్య ఆశయం.
ఈ రెండవ ఆశయసాధనకు బడుగు బలహీనవర్గాలవారందరూ కలిసి జనసేనతో పనిచేయాలని
అవినీతిరహిత పరిపాలనకు దోహదం చేయాలంటే సరికొత్త పరిపాలన కోరుకోవాలని ఆశిస్తూ….