సిలికానాంధ్ర మనబడి పదాధికారుల సమావేశం శని ఆదివారాల్లో నిర్వహించారు అమెరికా కెనడా దేశాల నుండి 150 మంది మనబడి నిర్వాహకులు ఈ సమావేశానికి విచ్చేశారు మనబడి వ్యవస్థాపక చైర్మన్ కూచిబొట్ల ఆనంద్ మాట్లాడుతూ తెలుగు భాష అభివృద్ధికి మనబడి ద్వారా చేపట్టవలసిన చర్యలు గురించి వివరించారు మనబడి నిర్వాహకులు రాజు చామర్తి రాయవరం భాస్కర్ డాంజీ తోటపల్లి కూచిబొట్ల శాంతి శ్రీవల్లి కొండబట్ల శ్రీరామ్ కోటిని దిలీప్ కొండిపర్తి తదితరులు పాల్గొన్నారు