తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా వంశి రెడ్డి కంచన కుంట్ల బాధ్యతలు చేపట్టారు గత వారాంతంలో లాస్ వేగాస్ లో జరిగిన సమావేశంలో ఆయన నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు ఆయనతోపాటు నూతన కార్యవర్గం కూడా పదవి బాధ్యతలు చేపట్టింది వంశీ రెడ్డి అధ్యక్షతన నూతన కార్యవర్గ సమావేశం జరిగింది నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వంశీ రెడ్డిని టాటా నిర్వాహకులు పైళ్ల మల్లారెడ్డి పట్టోళ్ళ మోహన్ రెడ్డి విజయ్ పాల్ రెడ్డి ఘనగోని శ్రీనివాస్ తదితరులు అభినందనలు అందజేశారు