తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా లాస్ఏంజిల్స్ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. 40 సంవత్సరాల క్రితం ఎన్.టీ.ఆర్ పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో రూపొందించిన రెండు రూపాయల కిలో బియ్యం పథకం స్ఫూర్తితో ఈ అన్నదాన కార్యక్రమం చేపట్టినట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముందు టిడిపి మరియు ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు ఘన నివాళి అర్పించారు.
చందు నంగినేని, విష్ణు అటుకారి, రాహుల్ వాసిరెడ్డి, సురేష్ అంబటి, హేమ కుమార్ గొట్టి, ప్రసాద్ పాపుదేశి, రంగారావు నన్నపనేని, రామ్ ఎలమంచిలి, స్వరూప్ ఏపూరి, సురేష్ కందెపు, అజయ్ చావా, శ్రీధర్ పొట్లూరి, నరసింహారావు ప్రత్తిపాటి, సతీష్ గుండపనేని, సునీల్ పతకమూరి, హరి మాదాల, ప్రతాప్ మేదరమెట్ల, విష్ణు యలమంచి, రాజేష్ యడ్లపాటి, రమేష్ మద్దినీడి తదితరులు పాల్గొన్నారు.
ఎన్.టి.ఆర్ వర్ధంతి. LAలో అన్నదానం.
Related tags :