Devotional

TNI ఆధ్యాత్మిక వార్తలు. బంగారు కామాక్షి దేవి

TNI ఆధ్యాత్మిక వార్తలు. బంగారు కామాక్షి దేవి

🔱బంగారు కామాక్షీదేవీ🔱
🚩🔯🚩

కాంచీపురం కామాక్షీదేవీ ఆలయంలో
కామకోటి కామాక్షి, తపస్సు కామాక్షి ,
బంగారు కామాక్షి, అంజన కామాక్షి,
ఉత్సవ కామాక్షి అని ఐదుగురు కామాక్షి లు వెలసివున్నారు.

కామాక్షి దేవి త్రినేత్రం నుండి బ్రహ్మదేవుని ధ్యానంలో ఆవిర్భవించిన దేవి బంగారు కామాక్షి. బ్రహ్మదేవుడు ఈ దేవి స్వర్ణ ప్రతిమను కాంచీపురం లో ప్రతిష్టించి
ప్రతీ ఫాల్గుణమాసం ఉత్తరా నక్షత్రం రోజున ఘనంగా కళ్యాణోత్సవం జరిపిస్తూవుండేవాడు.

16 వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పతనమై విదేశీయుల దండయాత్రలు
ఆరంభించారు. ఈ పరిస్థితులలో కాంచీపురంలో కూడా
అసాధారణ పరిస్థితులు నెలకొన్నవి.
బ్రహ్మదేవుడు ఆరాధించిన బంగారు కామాక్షీదేవి ని విదేశీయుల బారినుండి కాపాడమని స్ధానికులు అప్పటి కాంచీపుర
62 వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర స్వామికి
విన్నపించుకోగా స్వామీజీ బంగారు కామాక్షీదేవి ని
కాంచీపురంనుండి భద్రంగా తీసుకుని
సెంజికి తరలించారు. ఆనాటి ఉడైయార్ పాళయ జమీందారు రక్షణలో కామాక్షి దేవిని అక్కడే ప్రతిష్టించి
పూజిస్తూ వచ్చారు.

కాలక్రమేణా తంజావూరుని పాలించిన మరాఠా మహారాజు ప్రతాప సింహుని మంత్రి డబీర్ పంత్ ఉడైయార్ పాళయంలో వున్న
కాంచీపుర మఠాధిపతిని కలుసుకుని
బంగారుకామాక్షీదేవి ని తంజవూరు తీసుకురమ్మని ప్రతాప సింహ మహారాజు ఆదేశించినట్లు విన్నవించాడు.
ప్రతాప సింహ మహారాజు ఆహ్వానాన్ని అంగీకరించి కాంచీపుర మఠాధిపతి శ్రీ చందశేఖరేంద్ర స్వామి బంగారు కామాక్షీదేవీ
విగ్రహంతో రాగా మహారాజు ఘన స్వాగతం యిచ్చాడు.
ప్రధమంలో మహారాజు బంగారు కామాక్షీదేవీ ని తన రాజభవనంలో ప్రతిష్టించి పూజించ
తలిచి తన కోరిక ని తమ ఆధ్యాత్మిక గురువైన
ఆది భీమ గోస్వామివారికి తెలుపగా
దానికి ఆయన ఆమోదించలేదు. అప్పుడు, బంగారు కామాక్షీదేవి విగ్రహాన్ని తంజావూరు
మేలవీధిలో
మూల ఆంజనేయుని ఆలయంలో భద్రపర్చమని ఆనతి యిచ్చారు.
ఈ పరిస్థితులలో మరాఠా మహారాజు ప్రతాప సింహుని స్వప్నంలో దర్శనమిచ్చిన మూల ఆంజనేయస్వామి, దేవి విగ్రహాన్ని తొలుత తన ఆలయంలోనే ప్రతిష్టించి
తర్వాత తన ఆలయ సమీపమున బంగారు కామాక్షీదేవీ కి
ప్రత్యేక ఆలయం నిర్మించమని ఆదేశించాడు.
తమ గురువులు చెప్పినదే ఆంజనేయస్వామి
చెప్పడంతో మహారాజు దేహం పులకించినది.

తమని రక్షించడానికే కామాక్షిదేవి అక్కడికి వచ్చినదని చోళదేశ ప్రజలు భావించారు.

బంగారు కామాక్షీదేవి ని తంజావూరు లో ప్రతిష్టించినందులకు కృతజ్ఞతతో మరాఠా మహారాజు శ్రీకాంచి పీఠాధిపతులకు కుంభకోణంలో కావేరీ దక్షిణ తీరాన ఉన్న సువిశాల భూమిని దానం చేశాడు.

సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం సమయాలలో కూడా యీ ఆలయం తెరిచేవుంటుంది.
తంజవూరు మేలవీధిలోనే రామాలయం,
కృష్ణాలయాల సమీపమున తూర్పు ముఖంగా బంగారుకామాక్షి
ఆలయం వున్నది.

కామాక్షి అంటే భక్తుల కోరికలు ఈడేర్చే దేవి. ఈ దేవి సదా తన అనుగ్రహవీక్షణలతో ప్రజలను రక్షిస్తున్నది. అందువలననే ఈ దేవి కామకోటి అని కూడా పిలువబడుతున్నది. నిత్యం ఆరు కాల పూజలు జరుగుతాయి.

కర్నాటక సంగీత
మూర్తిత్రయంలోని వాడైన శ్యామశాస్త్రి బంగారు కామాక్షి ఉపాసకుడు.
అమ్మవారి అనుగ్రహంతో
శ్యామా శాస్త్రి సంగీతం, గణితం , జ్యోతిష్య, మంత్ర శాస్త్ర విద్యలలో పాండిత్యం సంపాదించారు.
అమ్మవారి సమక్షంలో నిత్యము ధ్యానంలో వున్న సమయంలో బంగారు కామాక్షి
సూత్రప్రాయంగా కీర్తనల ఆరంభాన్ని అందించగా
శ్యామా శాస్త్రి దేవి పరంగా
అనేక కీర్తనలు రచించారు.
శ్యామశాస్త్రి కీర్తనలనేకం సంగీతలోకంలో ప్రసిధ్ధి పొందాయి.

*తిరుమల : నేడు తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా అంగ ప్రదక్షిణ టికెట్లను.. మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్ ద్వారా విడుదల చేయనుంది. అంగప్రదక్షిణ టికెట్లను కావాలనుకునే భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చని తెలిపింది.