Politics

టీడీపీలో ఒక రాధ – ఇద్దరు కృష్ణులు టైపులో పాలిటిక్స్ !

టీడీపీలో ఒక రాధ – ఇద్దరు కృష్ణులు టైపులో పాలిటిక్స్ !

ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో స్థానిక నాయకుల మధ్య భారీ ఎత్తున ఫైట్ సాగుతోంది. చాలా నియో జకవర్గాల్లో నేతలకు వివాదాలు సాగుతున్నాయి. అవి రూపం ఎలా ఉన్నప్పటికీ.. వివాదం మాత్రం కామన్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. దీంతో వచ్చే ఏడాది అధికారంలోకి వచ్చేయాలని భావిస్తున్న టీడీపీలో చిన్నచిన్న ఇబ్బందులు.. పెద్ద తలనొప్పిగా మారడం గమనార్హం.
ప్రస్తుతం పార్టీని పుంజుకునేలా చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే యువగళం పేరిట ముందుకు సాగుతోంది. దీని వల్ల పార్టీని పుంజుకునేలా చేయడంతోపాటు.. పార్టీ విషయంలో ప్రజలకు – నేతలకు మధ్య సంబంధాలను పెంపొందించాలనేది లక్ష్యంగా ఉంది. కానీ క్షేత్రస్థాయిలో 50 నియోజకవర్గాల్లో నాయకులకు పడడం లేదు. ఈ నియోజకవర్గాలలో ఒక రాధ – ఇద్దరు కృష్ణులు టైపులో పాలిటిక్స్ ఉన్నాయి.

నియోజకవర్గం నుంచి పోటీకి ఇద్దరేసి చొప్పున 30 నియోజకవర్గాలు ఉండగా.. అంతకుమించినవి 10 ఉం డగా.. ప్రత్యర్థులతో మమేకమై.. వారి వ్యాపారాలు వారు చేసుకుంటున్న పరిస్థితిలో మరో 10 మంది ఉన్నా రు. ఈ విషయాలపై పార్టీ అధిష్టానం లెక్క తీసింది.

ఈ లెక్కల నేపథ్యంలోనే త్వరలోనే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఉదాహరణకు పోలవరం పుట్టపర్తి విజయవాడ వెస్ట్, విజయవాడ తూర్పు ,గుంటూరు వెస్ట్, చిత్తూరు, ఏలూరు , కందుకూరు
వంటి కీలక నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.

ఎన్నికల ముంగిట పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలకు ఏమేరకు నాయకులు స హకరిస్తారనేది ఒక వైపు చర్చకు దారితీస్తూ ఉండగానే.. మరోవైపు.. నేతల మధ్య ఇలా వివాదాలు కొనసాగు తుండడం పార్టీలో చర్చకు దారితీసింది. మరి చివరకు ఏం జరుగుతుందో ? చూడాలి.