Politics

FLASH నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత

FLASH నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థత

Nandamuri Taraka Ratna నారా లోకేష్ పాదయాత్రలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లోకేష్ వెంట తారకరత్న మసీదులోకి వెళ్లి ప్రార్థనల్లో పాల్గొన్నారు. బయటకు వచ్చిన సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చిన సమయంలో పల్స్ లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించే అవకాశం ఉంది. ఉదయం నుంచి కుప్పంలో లోకేష్‌తో పాటూ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం కుప్పంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna Ill) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యువగళం పాదయాత్రలో స్పృహ‌త‌ప్పి పడిపోగా.. హుటాహుటిన కుప్పం కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు

తారకరత్నను ఆస్పత్రికి తరలించిన సమయంలో పల్స్ లేదని.. శరీరం బ్లూగా మారి ఉందని అక్కడి సిబ్బంది తెలిపారు. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టామని చెప్పారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఆయన్ను బెంగళూరు తరలించే అవకాశం ఉందని చెబుతున్నారు. విషయం తెలిసిన వెంటనే నందమూరి బాలయ్య కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నారా లోకేష్ లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం కొద్దిదూరం నడిచిన అనంతరం.. అక్కడ మసీదులో లోకేష్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. తారకరత్న కూడా లోకేష్ వెంట మసీదులోకి వెళ్లారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానుల తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలుస్తోంది.