కెనడా టొరంటోలో హార్ట్ ఫుల్ నెస్ ఇన్స్టిట్యూట్ 49వ వార్షికోత్సవ వేడుకలు మరియు సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా జరిగినది. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను చవిచూపించాయి. సంక్రాంతి సంబరాలలో వంద మంది కళాకారులు సంగీతం,నృత్యం, వాయిద్యాలతో ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నాయి. హార్ట్ ఫుల్నెస్ సంస్థ సభ్యులు ముగ్గురు యోగా,ధ్యానం వాటి ఉపయోగాలను వివరించారు. ప్రేక్షకులను పది నిముషాల పాటు కళ్ళు మూసుకోమని అందరిచేత ధ్యానం చెయ్యించారు. కెనడా లోని హార్ట్ ఫుల్నెస్ సంస్థ ప్రధాన నిర్వాహకులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా బిర్చ్మౌంట్ ఫ్రెండ్స్ క్లబ్(BFC), ఒంటారియో తెలుగు ఫౌండేషన్, దుర్హం తెలుగు క్లబ్ సంస్థలు . ముఖ్యం గా సూర్య కొండేటి, మురళి రెడ్డి చెర్ల, వెంకట్, సర్దార్ ఖాన్ గార్లు ఎంతో స్ఫూర్తి నిచ్చారు.
హార్ట్ ఫుల్ నెస్ సంబరాల నిర్వహణను తమ బుజస్కంధాలపై వేసుకుని కనుల పండువగా రక్తి కట్టించిన నిర్వాహకులు ప్రవాస భారతీయులైన విశ్వనాథన్ శ్రీనివాసన్, మోహన్ బోండా, సూర్య కొండేటి ,మురళి రెడ్డిచర్ల, వెంకట్ చిలువేరు లను ఆయా సంస్థల సభ్యులు అభినందించారు.థార్న్హిల్ ,ఎంపీపీ లారా స్మిత్, ఎంపీపీ దీపక్ ఆనంద్ ,థోర్న్హిల్ ఎంపీ మెలిస్సా లాంట్స్మన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.కార్యక్రమానికి హాజరయిన అతిధులందరికి నిర్వాహకులు చక్కటి ఆతిద్యం విందు ఏర్పాటు చేశారు. టొరంటో హార్ట్ ఫుల్ నెస్ నిర్వాహక కార్య దర్శకులు విశ్వనాథన్ మరియు మోహన్ బోండా మాట్లాడుతూ హార్ట్ ఫుల్ నెస్ హృదయపూర్వక లక్ష్యం- నమ్మకం, సహనం, ప్రేమ, ఓర్పు, క్రమశిక్షణ. అంగీకారం వంటి మంచి లక్షణాలను పెంపొందించడంలో మన బావి తరాలకు అందించే ఏర్పాట్లు చేస్టున్నామని మరిన్ని తెలుగు ఔన్నత్యాన్ని ఉన్నత స్థితికి పెంచే మంచి తెలుగు కార్యక్రమాలతో ముందుకు వస్తామని తెలిపారు