పంటినొప్పి బాధ అంతా ఇంతా కాదు. అయితే అది అక్కడి వరకూ మాత్రమే పరిమితమైతే ఫరవాలేదు. కానీ తరచూ దంతాలు, చిగుళ్ల వ్యాధులతో బాధపడేవాళ్లలో మతిమరపు వచ్చే అవకాశం ఎక్కువని సియోల్ నేషనల్ విశ్వవిద్యాలయ నిపుణులు అంటున్నారు.
* పోషకాలు తక్కువా క్యాలరీలు ఎక్కువా ఉండే తియ్యని శీతలపానీయాలు మధుమేహానికి దారితీస్తాయనీ కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిదనీ హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్ టోరంటోకి చెందిన పరిశోధకులు.
* పోషకాహారం తీసుకున్నా ఔషధాలు మింగినా అన్నీ నిండునూరేళ్లూ ఆరోగ్యంగా జీవించేందుకే. అయితే వాటితోబాటు ఇవి కూడా పాటిస్తే దీర్ఘకాలం జీవిస్తారని విభిన్న పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
* పేదవాళ్లతో పోలిస్తే ఎలాంటి దురలవాట్లూ లేకుండా సరిపడా సంపాదన ఉండేవాళ్లు మరో పదిహేనేళ్లు ఎక్కువకాలం జీవిస్తారట.
* నచ్చే పాటలు వినడం, పర్యటనలకు వెళ్లడం వంటివి మానసికోల్లాసాన్ని కలిగించడంతో శారీరకంగానూ ఆరోగ్యంగా ఉంటారు.
* నవ్వు ఒత్తిడినీ ఆందోళననీ తగ్గించి రోగనిరోధకశక్తిని పెంచడంతోబాటు మెదడుకి రక్తసరఫరానీ తద్వారా ఆరోగ్యాన్నీ అందిస్తుంది.
* పర్వతాలమీదా కొండలమీదా- అంటే ఎత్తుల్లో జీవించేవాళ్లలో అక్కడి వాతావరణంలో ఆక్సిజన్ శాతం తక్కువ ఉండటంతో రక్తప్రసరణ అందుకు అనుగుణంగా రూపుదిద్దుకుని, మరింత సమర్థంగా పనిచేస్తుందనీ అందుకే వాళ్లలో హృద్రోగాలు తక్కువగా ఉన్నాయనీ దీర్ఘకాలం జీవిస్తున్నారనీ గుర్తించారు.
* అసలు చదవని వాళ్లకన్నా పత్రికలు, పుస్తకాలు చదివే వాళ్లలో ఆయుఃప్రమాణం ఎక్కువ.
* ఒంటరితనం రోగనిరోధకశక్తిని తగ్గించడం ద్వారా ఆయుష్షుని 50 శాతం తగ్గించేస్తుంది. అదే ఉమ్మడి కుటుంబంలో ఉంటూ పిల్లలతో గడిపితే జీవితంపట్ల ఆసక్తి పెరుగుతుంది.
* ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లు మిగిలినవాళ్లకన్నా 14 సంవత్సరాలు ఎక్కువకాలం జీవిస్తారు.
* ఎన్ని మందులు మింగినా ఎందరు వైద్యుల్ని సంప్రదించినా దక్కని ఆరోగ్యం రోజూ ఓ అరగంట వేగంగా నడిస్తే దొరుకుతుంది.వాకింగ్ చేస్తున్నా ఇంట్లో ఉన్నా తోడుగా ఓ పెంపుడుకుక్క ఉంటే ఒత్తిడి, బీపీ వంటివి దూరంగా ఉంటాయి.
* లిఫ్ట్‌లూ ఎలివేటర్లకు బదులు రోజూ మెట్లు ఎక్కడంవల్ల వృద్ధాప్యానికి కారణమయ్యే కణాలు తగ్గి, యౌవ్వనంతో ఉంచే మెదడు కణాల సంఖ్య పెరుగుతుంది.
* అందరిలో తప్పొప్పుల్ని ఎంచుతూ కూర్చోకుండా పెద్దమనసుతో క్షమించేస్తూ గతాన్ని మరిచి, భవిష్యత్తులోకి చూస్తూ, వర్తమానంలో ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తే ఆడుతూపాడుతూ అలవోకగా నూరు వసంతాలు పూర్తిచేసుకుంటారట.
సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే ఎక్కువకాలం జీవిస్తారు
Related tags :