Sports

ప్రపంచకప్ గెలిచిన భారత్

ప్రపంచకప్ గెలిచిన భారత్

సౌత్ ఆఫ్రికా లో జరుగుతున్న తొలి అండర్-19 మహిళల ప్రపంచకప్ ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత ఇంగ్లాండ్ ను 68 పరుగులకే కట్టడి చేసిన భారత్.. 14 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.

షఫాలి వర్మ(15), శ్వేతా సెహ్రావత్ (5) త్వరగా వెనుదిరగ్గా, సౌమ్య తివారి (24), తెలుగు అమ్మాయి త్రిష(24) చివరి వరకు ఉండి ఇండియాను గెలిపించారు.