💥నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు…💥
👉ఈ సమావేశానికి నెల్లూరు నగర మేయర్ తో పాటు 10 మంది కార్పొరేటర్ లు ఒక కో ఆప్షన్ సభ్యురాలు పాల్గొన్నారు..
ఈ సదర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ….
నెల్లూరు నగర మేయర్ స్రవంతి,10 కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యురాలు కు, నేను కష్ట కాలం లో వున్నప్పుడు నా వెంట నడుస్తున్న అందరికీ కృతజ్ఞతలు అని తెలియచేస్తూ…
ఫోన్ ట్యాపింగ్ కు సంబందించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు రాత పూర్వకంగా పిర్యాదు చేశాననీ…
కేంద్రానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై పిర్యాదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఉలికిపాటు ఎందుకు?అని
ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా కేంద్రానికి లేఖ రాసి తన మీద వస్తున్న ఆరోపణలు పై వివరణ ఇచ్చుకోవాలనీ…
ఈ రాష్ట్రం లో ఎంతో మంది ఎమ్మెల్యే లు,ముఖ్య మైన వారి ఫోన్ లు ట్యాపింగ్ కు గురౌతున్నాయని అనుమానాలు ఉన్నాయనీ వీటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలనీ కోటంరెడ్డి కోరారు .
బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పై మాట్లాడ కుండా నాతో మాట్లాడిన వ్యక్తి చేత మాట్లాడిస్తా అని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటి,బాలినేని కొండని తవ్వి ఎలుకను కూడా పట్టలేక పోయారు,
నా మిత్రుడు లంకా రామ శివా రెడ్డి కి సజ్జల రామకృష్ణా రెడ్డి సరైన స్క్రిప్ట్ ఇవ్వలేదు అందుకే నాలుగు నెలలుగా నా దగ్గర కాల్ రికార్డులు వున్నాయి కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో మాట్లాడిన కాల్ రికార్డులు డిలీట్ చేశానని చెప్పడం హాస్యాస్పదం….
ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజక వర్గం నుండి పోటీ చేస్తా అని హామీ ఇస్తే ఇంక ఆదాల గురించి ఎప్పటికీ మాట్లాడను….
ఆదాల ప్రభాకర్ రెడ్డి ని సూటిగా అడుగుతున్నా నువ్వు వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ అభ్యర్ధిగా పోటీ చేస్తానని హామీ ఇవ్వగలవా?
ఆదాల ప్రభాకర్ రెడ్డి నిన్న నా గురించి మాట్లాడుతూ …
శ్రీధర్ రెడ్డి జీవిత కాలం ధర్నా లు చేసుకోవాలని మాట్లాడావు నువ్వు జాతకాలు చెప్పడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు ..
ఆల్ మట్టి ఇంజనీర్లు దగ్గర నుండి, కాంట్రాక్టర్ ల నుండి కాదు నేను వచ్చింది నేను వచ్చింది ఉద్యమాల నుండి ధర్నాల నుండే…
గతం లో టిడిపి పార్టీ లో బి ఫారం తీసుకుని పరుగో పరుగు అని వైకాపా పార్టీ లోకి వెళ్ళిపోయావు,పెళ్లి నిశ్చితార్దం చేసుకుని తాళి కట్టే సమయానికి పెళ్లి కొడుకు పారిపోయినట్టు టిడిపి లో బి ఫారం తీసుకుని వైకాపా లోకి వెళ్ళిన నీవు జగన్మోహన్ రెడ్డి ని న్నను రౌడీలు గూండాలు అని మాట్లాడిన ఆదాల అవకాశ వాధి అని మాట్లాడారు…
కోటంరెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి తో పాటు 10 మంది కార్పొరేటర్లు,ఒక కో ఆప్షన్ సభ్యురాలు పాల్గొన్నారు …..
ఈ సందర్బంగా మేయర్ స్రవంతి మాట్లాడుతూ మురికి వాసన వచ్చే చోటుకి ఎవ్వరూ వెళ్లరని అలాంటిది అధికార పార్టీ ఎమ్మెల్యే గా వుంటూ కూడా ప్రజల సమస్యల పరిష్కారం కోసం మురికి కాలువలోనే దిగిన వ్యక్తి అని తాము వూపిరి వున్నంత వరకూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే నడుస్తా నని తెలిపారు,
కార్పొరేటర్లు మాట్లాడుతూ తమకు పార్టీల తో సంబందం లేదని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటే తాము చివరి వరకూ నాడుస్తామని తెలియ చేశారు….