Movies

మహేష్‌ కోసం రూ. 10 కోట్లతో విలాసవంతమైన ఇళ్లు

మహేష్‌ కోసం రూ. 10 కోట్లతో విలాసవంతమైన ఇళ్లు

మహేష్‌ బాబు కోసం దాదాపు 10 కోట్ల రూపాయలతో ఓ ఇంటిని నిర్మించనున్నారు. అత్యంత విలాసవంతంగా ఈ ఇళ్లు ఉండనుందట. ఏఎస్‌. ప్రకాష్‌ నేతృత్వంలో ఈ ఇళ్లు రూపుదిద్దుకోనుందట.

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్ల కోసం ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి వాటిలో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ క్రేజీ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా వంటి మంచి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరిద్దరూ మూడో సారి కలిసి పని చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్‌ పూజా హెగ్డే మహేష్‌ సరసన నటిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇది ఓ సరికొత్త యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమాగా తెరకెక్కనుందట. ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్‌ ఇప్పటికే పూర్తయింది. తదుపరి షెడ్యూల్‌ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఓ ఖరీదైన సెట్‌ను వేయబోతున్నారట. ఏఎస్‌. ప్రకాష్‌ నేతృత్వంలో ఈ సెట్‌ పనులు జరగనున్నాయట. దాదాపు 10 కోట్ల రూపాయలతో ఓ ఇంటి సెట్‌ను వేస్తున్నారట. సినిమాలో హీరో మహేష్‌ బాబు కోసం ఈ సెట్‌ వేస్తున్నారట.

అత్యంత విలాసవంతంగా ఈ సెట్‌ ఉండనుందన్న టాక్‌ వినిపిస్తోంది. మహేష్‌ సినిమాల కోసం ఖరీదైన భారీ సెట్‌ వేయటం కొత్తేమీ కాదు. గతంలో అర్జున్‌ సినిమా కోసం ఏకంగా మధుర మీనాక్షి టెంపుల్‌ను సెట్‌గా వేశారు. 2004 టైంలోనే దాదాపు కోట్ల రూపాయలతో ఈ సెట్‌ వేశారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ దర్శకత్వం వహించారు. కలెక్షన్ల పరంగా అంతగా విజయం సాధించకపోయినా.. ఇందులో నటించిన నటీనటులకు మంచి పేరుతో పాటు అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. మరి, మహేష్‌ బాబు సినిమా కోసం దాదాపు 10 కోట్ల రూపాయలతో ఓ ఇంటి సెట్‌ వేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.