NRI-NRT

తానా ఎన్నికలు.. ముమ్మరంగా రాజీ ప్రయత్నాలు.TNI. ప్రత్యేకం..

తానా ఎన్నికలు..  ముమ్మరంగా రాజీ ప్రయత్నాలు.TNI. ప్రత్యేకం..

తానా ఎన్నికల్లో తొలి ఘట్టం ముగియటానికి ఇంకా మూడు రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తానా ఎన్నికలకు పోటీ లేకుండా ఏకగ్రీవం చేయటం కోసం తానా పెద్దలు రంగంలోకి దిగారు. తానా మాజీ అధ్యక్షులు కోమటి జయరాం,డాక్టర్ జంపాల చౌదరి, నాదెళ్ల గంగాధర్, తదితర తానా పెద్దలు ఎన్నికలు ఏకగ్రీవం చేయటం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

కోర్టు తీర్పు కోసం ఎదురుచూపు..
మరొకపక్క తానా ఎన్నికలు నిలిపివేయాలంటూ కొడాలి వర్గం కోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు సోమవారం గాని మంగళవారం గాని వచ్చే అవకాశాలు ఉన్నాయని వారు భావిస్తున్నారు. రాజీ ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే మరొక పక్క నామినేషన్ల గడువు ముగిసే సమయం ఆసన్నం కావడంతో తమ ప్యానెల్ తరపున వివిధ పదవులకు అభ్యర్థులను ఎన్నికల రంగంలోకి దింపడం కోసం ఉభయ వర్గాలు కసరత్తులు చేస్తున్నాయి. రాజీ ప్రయత్నాలు ఫలించక పోతే నామినేషన్లు వేయించడం కోసం ఉబోయ వర్గాలు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

తలరాతలు మార్చనున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్..
ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు తానా బోర్డు శ్రీకారం చుట్టింది. తానా ఎన్నికలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి ద్వారా నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సూచించింది. ఎన్నికల సంఘం కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ కు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం తానా లో ఉన్న కొందరు పైరవీకారులకు మింగుడు పడటం లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో తమ ఆటలు సాగవని వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానానికి తానా సభ్యుల్లో అత్యధికమంది తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నారు.

కిలారు ముద్దుకృష్ణ.
సీనియర్ జర్నలిస్ట్.