Movies

అతను ఓ జెమ్‌

Alia Bhatt Praises Her Boy Friend Ranbir Kapoor As Gem

బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ తన జీవితంలోకి రావడంతో ఎంతో ఆనందంగా గడిపేస్తున్నారు నటి ఆలియా భట్‌. చిన్నప్పటి నుంచి తనకు రణ్‌బీర్‌ అంటే చాలా ఇష్టమని ఆలియా ఎన్నో సందర్భాల్లో అన్నారు. ఇప్పుడు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ‘రణ్‌బీర్‌తో రిలేషన్‌ గురించి మీ అభిప్రాయం ఏంటి?’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆలియా ఈ విధంగా సమాధానమిచ్చారు. ‘మాది రిలేషన్‌షిప్‌ కాదు. స్నేహం. రణ్‌బీర్‌ నా జీవితంలో ఉన్నందుకు మేఘాల్లో విహరిస్తున్నట్లుగా ఉంది. ఇద్దరం వృత్తిపరంగా ఎంతో బిజీగా ఉన్నాం. మా బంధంపై ఎవ్వరి కళ్లు పడకూడదు. రణ్‌బీర్‌ కఠినమైన వ్యక్తి కాదు. అతను ఓ జెమ్‌. గతంలో తనకు ఫెయిలైన లవ్‌స్టోరీస్‌ ఉన్న సంగతి నిజమే. కానీ అది పట్టించుకోవాల్సిన విషయం కాదని నా అభిప్రాయం. నాకూ ఉన్నాయిగా లవ్‌స్టోరీలు. నాకు చిరాకు తెప్పించే విషయం ఏంటంటే.. రణ్‌బీర్‌తో నా పెళ్లెప్పుడు అని రోజూ మీడియా వర్గాలు ప్రశ్నించడం. ఉదయం లేవగానే నా గురించి ఇవే వార్తలు వస్తుంటాయి. నాకు తెలిసి ఈ వార్తలకు రణ్‌బీర్‌ కూడా అలవాటుపడిపోయి ఉంటాడు’ అని వెల్లడించారు ఆలియా. ప్రస్తుతం ఆలియా, రణ్‌బీర్‌ ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. అమితాబ్‌ బచ్చన్‌, అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు. రెండు భాగాలుగా సినిమా తెరకెక్కుతోంది. తొలి భాగం క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది.