Movies

వాల్తేరు వీరయ్య.. మెగాస్టార్ గ్రేసుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే…

వాల్తేరు వీరయ్య.. మెగాస్టార్  గ్రేసుకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే…

మెగాస్టార్ చిరంజీవిని ఒకప్పటి వింటేజ్ గెటప్ లో చూపిస్తూ దర్శకుడు బాబీ డైరెక్ట్ చేసిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’.చిరులోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేస్తూ, థియేటర్ కి వచ్చిన ప్రతి సినీ అభిమానికి శంకర్ దాదా MBBS సినిమాలోని చిరుని గుర్తు చేస్తూ బాబీ వాల్తేరు వీరయ్య’ సినిమాని సూపర్బ్ గా తెరకెక్కించాడు. మాస్ మూలవిరాట్ చిరుకి, మాస్ మహారాజ్ రవితేజ కూడా కలవడంతో వాల్తేరు వీరయ్య సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. మెగాస్టార్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన వాల్తేరు వీరయ్య సినిమా చిరు మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది. ఈ మూవీకి దేవి ఇచ్చిన సాంగ్స్ బిగ్గెస్ట్ ఎస్సెట్ అనే చెప్పాలి. బాస్ పార్టీ, పూనకలు లోడింగ్ సాంగ్ అయితే మెగా ఫాన్స్ కి నిజంగానే పూనకలు తెచ్చాయి.

దాదాపు థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ‘నీకేమో అందం ఎక్కువ నాకేమో తొందరెక్కువ’ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో చిరు డాన్స్ గ్రేస్ సూపర్బ్ గా ఉంటుంది. ఆ ఏజ్ లో కూడా అంత ఈజ్ తో డాన్స్ చెయ్యగల హీరో మరొకరు లేరు అనడంలో ఆశ్చర్యం లేదు. శృతి హాసన్ కూడా చిరు పక్కన
అందంగా డాన్స్ చేస్తుంది. లిరికల్ సాంగ్ సమయంలో ఈ సాంగ్ బాగానే ఉంది అనిపించింది కానీ సినిమాలో డైరెక్ట్ గా చూస్తే మాత్రం ఈ పాట బాగా నచ్చుతుంది. ఫారిన్ లోకేషన్స్, చిరు డాన్స్ లో గ్రేస్, శృతి గ్లామర్ అన్నీ పుష్కలంగా ఉన్న’నీకేమో అందం ఎక్కువ’ సాంగ్ ఇప్పుడు యుట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతుంది