NRI-NRT

ప్రపంచ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

ప్రపంచ వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

మహేశ్‌ బిగాల తెలంగాణ రాష్ట్ర సాధన రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలు ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సాధన రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టిన రోజు వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలు ఘనంగా నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల పిలుపునిచ్చారు.ఈనెల 17న కేసీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని దేశాల్లో రక్తదాన శిబిరాలు, గ్రీన్‌ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటాలని కోరారు.

అనాధలకు సహాయం చేయడం లాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించాలని బీఆర్‌ఎస్‌ ప్రతినిధులను కోరారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా మారాయని అన్నారు. ప్రధానంగా వ్యవసాయం, పారిశ్రామిక, ఐటీ, విద్యుత్‌ రంగాల్లో సాధించిన ప్రగతి అభినందనీయమని అన్నారు. పేద, బడుగు,బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు విజయవంతంగా అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.