Health

కరివేపాకే అని తీసేస్తున్నారా.. అయితే నష్టపోతారు..

కరివేపాకే అని తీసేస్తున్నారా.. అయితే నష్టపోతారు..

చాలా మంది అన్నం తింటుంటే.. కర్రీలో కరివేపాకు తీసి పక్కకు వేస్తారు. కానీ కరివేపాకు తింటే చాలా మంచిదని ఆహార నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో ఎన్నో రకాల పోషక విలువలు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది జీర్ణ క్రియను మెరుగుపరచడంలోనూ మలబద్ధకాన్ని తగ్గించడంలోను ఉపయోగపడుతుంది.

దోహదపడతాయి.ఇక కంటి చూపును మెరుగుపరచడంలో కూడా కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలిగినటువంటి ఈ కరివేపాకును తరచు ఆహారంలో తీసుకోవడం వల్ల కొన్ని వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా తొలగిపోతాయి. కరివేపాకులో కార్బజోల్ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ని అరికట్టడంలో ఉపయోగపడతాయి.

టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిసాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. కరివేపాకులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడంతో జీర్ణక్రియను నెమ్మది చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా చేస్తాయి. ఇందులోని ఫైటో కెమికల్స్ ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. ముదిరిన కరివేపాకును ప్రతిరోజు క్రమం తప్పకుండా మూడు నెలల పాటు తినటం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుందట.

ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం కరివేపాకులో యాంటీ హైపర్ గ్లైసెమిక్ లక్షణాలు ఉన్నాయి. ఎలుకల మీద జరిపిన పరిశోధనలో కరివేపాకు వల్ల షుగర్ లెవల్స్ తగ్గాయని పలు అధ్యయనాల్లో తేలింది. కరివేపాకు పొడి చేసి పెట్టుకుని కూరల్లో వేసుకోవచ్చు. ఇవి కూరలకు మరింత అదనపు రుచి ఇస్తుందని చెబుతున్నారు.