NRI-NRT

హాంగ్ కాంగ్ లో ఘనంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు. 2019 నుంచి తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు

హాంగ్ కాంగ్ లో ఘనంగా తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు. 2019 నుంచి తెలుగు సాంస్కృతిక ఉత్సవాలు

ఇది ముఖ్యంగా మన శ్రీసమస్, ఆంగ్ల నూతన సంవత్సరం మరియు అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవం ని కలిపి జరుపుకునే తెలుగు పండుగ పిల్లలచే ఘనంగా హాంగ్ కాంగ్ లో జరిగింది.

పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఫ్యాన్సి డ్రస్, తెలుగు భక్తి గీతాలు, పద్యాలు, పాటలు, సాంప్రదాయ – సమకాలీన – జానపద నృత్యాలను ప్రదర్శించారు.. అలాగే పిల్లలు అమ్మాయి తేజస్వి సారంగా మరియు అబ్బాయి వరుణ్ నాల్గె వ్యాఖ్యాతలగా కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు.

పిల్లలను ప్రోత్సహిస్తూ ప్రశంసా పత్రాలను అందజేసిన పూర్వ కార్యదర్శి ఫాథర్ మిరియాల బాల కిశోర్ గారు, విదేశాలలో వుంటూ పిల్లకు మాతృ భాష – సాంప్రదాయాలను తమ పిల్లలకు శ్రద్ధగా నేర్పిస్తున్నందుకు తల్లి తండ్రులను అభినందించారు.

సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి సభకు కృతజ్ఞతలు సమర్పిస్తూ సమాఖ్య కార్యవర్గ సభ్యులు ఫాథర్ బాల కిశోర్ గారిని, శ్రీ రాజశేఖర్ మన్నే, శ్రీమతి రమాదేవి సారంగా, శ్రీమతి కొండ మాధురి, శ్రీమతి హర్షిణి పచ్చ౦టి మరియూ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలను వారి తల్లి తండ్రులను అభినందించారు, కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం హాంగ్ కాంగ్ బాంగ్లాదేశ్ అసోసియేషన్ వారు నిర్వహించిన “ఫిబ్రవరి 21 భాషోధ్యమ దినం” సందర్భంగా జరిగిన కార్యక్రమం లో ముఖ్య అతిధులలో ఒకరి గా శ్రీమతి జయ పీసపాటి పాల్గొన్నారు. బంగ్లాదేశ్ అసోసియేషన్ ఆఫ్ హాంగ్ కాంగ్ అధ్యక్షులు సయ్యద్ మోహిఉద్దీన్ మోహి గారు ముఖ్య అతిధి మిస్ ఇసరత్ ఆరా గారిని , తదితర హాంగ్ కాంగ్ ప్రభుత్వ అధికారులను , UNESCO HK Glocal Peace Centre – హాంగ్ కాంగ్ అసోసియేషన్ గ్లోకల్ పీస్ సెంటర్ ఉపాధ్యక్షురాలు మిస్ మిటజీ లీయోంగ్ మరియు కమిటీ సభ్యుడు శ్రీ తిరుపతి నాచియప్పన, మరియు ఇతర ప్రముఖ స్వచ్ఛంద సంస్థల ప్రధాన ప్రతినిధులను సాదరంగా ఆహ్వానించారు .

ఈ సందర్భంగా బాంగ్లాదేశ్ కౌన్సుల్ జనరల్ మిస్ ఇసరత్ ఆరా మాట్లాడుతూ, భాష సమాన హోదా కోసం ఉద్యమం గురించి వివరించారు… ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ ప్రభుత్వం, ర్యాలీలు, మొదలైనవి ఢాకా నగరంలో నిషేధించిందని ,.ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు, సాధారణ ప్రజల సహకారంతో భారీ ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేశారని ప్రపంచంలోనే భాష కోసం ఇంత పెద్ద ఉద్యమం చేసిన ఘనత బాంగ్లాదేశ్ మాత్రమే అని తెలిపారు .1952 ఫిబ్రవరి 21 న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్, షఫియూర్ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. చరిత్రలో ఇది చాలా అరుదైన సంఘటన, ప్రజలు తమ మాతృభాష కోసం ప్రాణాలను అర్పించారని, అమరులైన వారికి మిస్ ఇసరత్ ఆరా శ్రద్ధ భక్తితో నీవాళులు అర్పించారు . తరువాత మిస్ మిటజీ లీయోంగ్ మాట్లాడుతూ UNESCO చేపట్టిన మాతృభాష పరిరక్షణ కార్యక్రమం గురించి వివరించారు. తాము నిరుడు జూమ్ మాధ్యమం ద్వారా నిర్వహించిన అంతర్ జాతీయ మాతృ భాష దినోత్సవం లో భారతీయ భాషలతో పాటు విదేశీ భాషలతో కలుపుకొని అదహారు భాషలతో పిల్లలు పాల్గొన్నారని శ్రీమతి జయ పీసపాటి తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని భాషలను కలిపే ప్రయత్నం చేస్తున్నామని అందుకు విచ్చేసిన ప్రతినిధుల సహాయం కోరారు. ఇతర అతిధులు తమ మాతృ భాష ప్రాముఖ్యత గురించి మరియు కార్యక్రమాల గురించి తెలిపారు . తదనంతరం పిల్లలు పాడిన దేశభక్తి గీతాలు పాడగా , అనంతరం BAHK జనరల్ సెక్రెటరీ రహమాన్ పలాష్ గారు వందన సమర్పణ తో కార్యక్రమాన్ని ముగించారు.