NRI-NRT

ప్రముఖ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ షోలో రామ్ చరణ్.. ఆ స్వాగ్ చూసి అందరూ షాక్!

ప్రముఖ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ షోలో రామ్ చరణ్.. ఆ స్వాగ్ చూసి అందరూ షాక్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల అమెరికాకు వెళ్ళిన విషయం తెలిసిందే. త్వరలోనే ఆస్కార్ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఆస్కార్ అవార్డ్స్ లో తప్పకుండా RRR సినిమాకు అవార్డు దక్కుతుంది అని అందరూ ఎంతో నమ్మకంతో ఉన్నారు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ చిత్ర యూనిట్ అందరికంటే ముందుగా అమెరికాకు వెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియాలో కనిపిస్తూ ఉండడం విశేషం. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ తేజ్ గుడ్ మార్నింగ్ అమెరికా అనే ఏబిసి ఛానల్ షో లో కనిపించారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో రామ్ చరణ్ తేజ్ RRR సినిమా గురించి అలాగే ఆ సినిమాకు వర్క్ చేసిన వారి గురించి చాలా గొప్పగా వివరణ ఇచ్చాడు. ఈ సినిమా ఇండియాకు చాలా ప్రత్యేకమని టెక్నీషియన్స్ కు కూడా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు అని వారికి కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది అని తెలియజేశారు.

ఇక రామ్ చరణ్ తేజ్ సినిమాకు సంబంధించిన విశేషాలను గురించి మాట్లాడుతూ ఇంగ్లీష్ మీడియా ప్రతినిధులు పొగడ్తలతో ముంచెత్తారు. అంతే కాకుండా ఆ సినిమాలో మీ స్వాగ్ అద్భుతంగా ఉంది అంటూ ప్రశంసించారు. ఇక రాంచరణ్ తేజ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయాన్ని గురించి కూడా వారు ఆ షోలో ప్రస్తావించి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన RRR సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకొని ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రముఖ హాలీవుడ్ తారలు కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఇక హాలీవుడ్ మీడియా కూడా ఇప్పుడు RRR సినిమాపై స్పెషల్ ఫోకస్ చేస్తోంది. మరి ఆస్కార్ అవార్డులలో సినిమా ఎలాంటి గుర్తింపు అందుకుంటుందో చూడాలి.