WorldWonders

నవ్వారని ఏడుగురిని కాల్చి చంపారు

నవ్వారని ఏడుగురిని కాల్చి చంపారు

ఆటలో ఓడిపోవడం చూసి నవ్వారని ఇద్దరు సాయుధులు ఏడుగురిని కాల్చి చంపారు.

ఈ ఘటనబ్రెజిల్లోని సినాప్ నగరంలో జరిగింది. పూల్ గేమ్
ఆడిన ప్రధాన నిందితుడు మొదటిసారి ఓడిపోవడంతో
పంతం కొద్దీ రెండో గేమ్ ఆడాడు. అందులోనూ
ఓడిపోవడంతో చుట్టుపక్కల వారు అతడిని చూసి
నవ్వారు. దీంతో సహనం కోల్పోయిన అతను మరో
వ్యక్తితో కలిసి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో 12
ఏళ్ల బాలిక సహా ఏడుగురు చనిపోయారు.