NRI-NRT

అమెరికాలో అయ్యప్ప మాల తీసివేయటంపై రామ్ చరణ్ క్లారిటీ.

అమెరికాలో అయ్యప్ప మాల తీసివేయటంపై రామ్ చరణ్ క్లారిటీ.

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ని ఎక్కువగా మాలలో చూస్తూ ఉంటాం. కాగా ఇటీవల మెగాపవర్ స్టార్ ఆస్కార్ మరియు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా వెళ్లే సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నాడు. తాజాగా

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ని ఎక్కువగా మాలలో చూస్తూ ఉంటాం. కాగా ఇటీవల మెగాపవర్ స్టార్ ఆస్కార్ మరియు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా వెళ్లే సమయంలో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నాడు. తాజాగా అమెరికన్ పాపులర్ టాక్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ కు రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్ళాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోల్లో రామ్ చరణ్ మాలలో కనిపించ లేదు.

దీంతో అమెరికా వెళ్లేముందు మాలలో ఉన్న రామ్ చరణ్, అమెరికాలో దిగగానే మాల ఏమి చేశాడు అంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఎలా పడితే అలా ఆచరించే క్రమంలో మాలని ధరించకండి అంటూ మరికొంతమంది చరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీని పై చరణ్ సన్నిహితులు వివరణ ఇచ్చారు. రామ్ చరణ్ స్వామి అర్ధ మండల దీక్ష చేపట్టారు. ఈ దీక్ష 21 రోజులు ఉంటుంది. ఫిబ్రవరి స్టార్టింగ్ చరణ్ స్వామి ఈ దీక్ష ప్రారభించినట్లు, అమెరికా వెళ్లే రోజు దీక్షలో చివరి రోజు అని తెలియజేశారు. అమెరికా వెళ్లిన తరువాత అక్కడ ఒక టెంపుల్ లో రామ్ చరణ్.. పద్ధతి ప్రకారమే మాల తీసినట్లు వెల్లడించారు.

కాగా ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ టాక్ షోకి ఇండియన్ నుంచి ఆహ్వానం అందుకున్న మొదటి సెలెబ్రెటీ రామ్ చరణ్ కావడంతో చరణ్ అభిమానులు మరియు కుటుంబసభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, ఉపాసన చిన్నమ్మ సంగీతారెడ్డి.. చరణ్ ని చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ లు చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.