Agriculture

తోడేరు‌ గ్రామ చెరువులో తిరగబడ్డ పడవ…

తోడేరు‌ గ్రామ చెరువులో తిరగబడ్డ పడవ…

పడవలో ప్రయాణిస్తున్న పది మంది యువకులు…

నలుగురు క్షేమం.. ఆరుగురు గల్లంతు..

సరదాగా పది మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరులో చోటు చేసుకుంది.ఆదివారం సాయంత్రం సరదాగా పది మంది పిల్లలు చెరువులో బోటు షికారుకు వెళ్లారు. ఆ బోటు ప్రమాదవశాత్తు తిరగబడింది. అందులోంచి నలుగురు క్షేమంగా బయటపడ్డారు. ఆరుగురు మాత్రం గల్లంతయ్యారు. సంఘటన ప్రదేశానికి పొదలకూరు సీఐ సంగమేశ్వరరావు , ఎస్ఐ కరిముల్లాలు చేరుకొని గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.