🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 *01.03.2023 ✍🏻*
🗓 *నేటి రాశి ఫలాలు 🗓*
🐐 మేషం
ఈరోజు (01-03-2023)
మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ఖర్చు అధికముగా ఉండును. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. మానసిక ఇబ్బందులు కొంత కలిగేటటువంటి సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండును. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. శారీరక ఒత్తిళ్ళు అధికమగును మేష రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 వృషభం
ఈరోజు (01-03-2023)
వృషభరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మరాశి యందు కుజుడు, అష్టమ బుధుని ప్రభావంచేత వృషభ రాశి వారు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత ఒత్తిళ్ళు వేదనలు అధికముగా ఉండును. వృషభరాశివారికి లాభమునందు గురుడు, దశమము నందు శని, శుక్రుల ప్రభావం చేత ఆర్ధికపరంగా లాభము చేకూరును. దశమములో శని, శుక్రుల అనుకూలత వలన ఉద్యోగులకు లాభదాయకముగా ఉండును. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృషభరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 మిధునం
ఈరోజు (01-03-2023)
మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్థముగా ఉంది. మిథున రాశి వారికి అష్టమ రవి, వ్యయస్థానమునందు కుజుని ప్రభావం చేత కుటుంబమునందు వివాదములు, అనారోగ్య సమస్యలు వేధించును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. దశమములో గురుని ప్రభావంచేత ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి. దశమంలో గురుడు, లాభములో రాహువు అనుకూల ప్రభావంచేత సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు. మిథునరాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
💑💑💑💑💑💑💑
🦀 కర్కాటకం
ఈరోజు (01-03-2023)
కర్కాటక రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించవలసిన సమయము. కర్కాటక రాశివారికి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించును. నూతనముగా వస్తువులను కొనడానికి ప్రయత్నించెదరు. అష్టమ స్థానము శని సంచరించుట చేత కుటుంబము విషయాలు, కోర్టు వ్యవహారాలు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. గురు, కుజ మరియు రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడును. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం కర్కాటక రాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 సింహం
ఈరోజు (01-03-2023)
సింహరాశి వారికి ఈ రోజు మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలున్నాయి. అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారికి భాగ్యములో రాహువు, అష్టమ స్థానములో గురుని యొక్క ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. కళత్ర స్థానము నందు శని శుక్రుల ప్రభావంచేత కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. స్త్రీలకు ఈ రోజు అనుకూలముగా ఉన్నది. సింహ రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
🦁🦁🦁🦁🦁🦁
💃 కన్య
ఈరోజు (01-03-2023)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. కన్యారాశికి భాగ్యమునందు కుజుడు, సప్తమ స్థానము నందు గురుడు, ఆరవ స్థానము నందు శని శుక్రుల ప్రభావంచేత ఈ రోజు చేసే ప్రతీ పని అనుకూలించును. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సమాజంలో కీర్తి కలుగును. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఈ రోజు ఒత్తిళ్ళు తగ్గును. శని మరియు గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు.
💃💃💃💃💃💃💃
⚖ తుల
ఈరోజు (01-03-2023)
ఈ రోజు మీకు మధ్యస్తముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించడం మంచిది. శరీర సౌఖ్యం కోసం ధనమును అధికముగా ఖర్చు చేసెదరు. మానసిక ఆనందము కలుగును. ధనలాభము కలుగును. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. కుటుంబ సౌఖ్యము కలుగును. సంతానము వలన సంతోషము కలుగును. అప్పుల వత్తిడి వుండును. మిత్రుల ద్వారా సహాయము పొందెదరు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం తులారాశి వారు మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 వృశ్చికం
ఈరోజు (01-03-2023)
ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నవి. చంద్రుని ప్రభావం చేత ఒత్తిళ్ళు, శారీరక శ్రమ అధికముగా ఉండును. ఉ ద్యోగములో ఒత్తిళ్ళు, వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు. ధనలాభము మరియు కుటుంబ సౌఖ్యము కలుగును. ఉద్యోగంలో ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధనలాభము కలుగును. శత్రువులు జాగ్రత్త వహించాలి. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృశ్చికరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 ధనుస్సు
ఈరోజు (01-03-2023)
ఈ రోజు మీకు మద్యస్తమునుండి అనుకూలంగా ఉన్నది. మీరు చేసే ప్రతీ పని యందు ఆచితూచి వ్యవహరించండి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉండటం మంచిది. మానసిక ఆందోళన కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు చికాకులు ఏర్పడును. ధనూరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 మకరం
ఈరోజు (01-03-2023)
ఈ రోజు మీకు మధ్యస్తమునుండి అనుకూల ఫలితాలున్నవి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. చికాకులు అధికముగా ఉండును. కీర్తి ప్రతిష్టలు పెరుగును. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఏలినాటి శని ప్రభావం చేత చేసే ప్రతి పని ఆచితూచీ జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మకరరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణచేయడం మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 కుంభం
ఈరోజు (01-03-2023)
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నవి. చంద్రుని అనుకూల ప్రభావం చేత కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. కుటుంబంలోని వారితోటి ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారికి తీవ్రముగా ఉన్నది. ప్రతీ పని ఆచితూచి వ్యవహరించవలసిన సమయము. శత్రువుల బాధలు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు సమస్యలు అధికముగా ఉన్నవి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుంభరాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మహా విష్ణువును ఆరాధన చేయడం మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 మీనం
ఈరోజు (01-03-2023)
ఈ రోజు మీకు మధ్యస్తమునుండి అనుకూల ఫలితములున్నవి. కుటుంబ సౌఖ్యము కలుగును. శారీరక శ్రమ అధికముగా ఉండును. ఆందోళన కలుగును. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. ప్రతీ పనిలో విజయాన్ని పొందెదరు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మీన రాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
🦈🦈🦈🦈🦈🦈🦈