Politics

మంత్రి రోజా దూకుడుకు బ్రేకులు వేయటానికి తెదేపా ప్రణాళికలు..

మంత్రి రోజా దూకుడుకు బ్రేకులు వేయటానికి తెదేపా ప్రణాళికలు..

నందమూరి తారకరత్న మరణం అతని కుటుంబంలో తీవ్రవిశాదాన్ని నింపింది. ఇప్పటికీ ఆయన చనిపోయారు అన్న నిజాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇక తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్య రెడ్డి ఆవేదనను ఎవరు ఆపలేకపోతున్నారు. అలేఖ్యను తిరిగి మామూలు మనిషిని చేయాలని కుటుంబ సభ్యులు ఎంతగా ప్రయత్నిస్తున్న ఆమె ఏమాత్రం భర్త జ్ఞాపకాలతో మానసికంగా కృంగిపోతుంది.

ఇదిలా ఉండగా, వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రోజాకు దీటుగా అభ్యర్థిని రంగంలోకి దింపాలని టిడిపి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి నగరి నియోజక వర్గం టిడిపి ఇన్చార్జ్ గా మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు కుమారుడు గాలి బానుప్రకాష్ వ్యవహరిస్తున్నారు. కానీ, తాజాగా నగరి నుండి కొత్త అభ్యర్థిని బరిలోకి దింపేందుకు టిడిపి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని నగరి నుండి పోటీలో నిలపనున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. రోజా, అలేఖ్య ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. అలాగే అలేఖ్య రెడ్డికి సానుభూతి కూడా ఉంటుంది. ఇదే సమయంలో టిడిపికి కమ్మ సామాజికవర్గం అండ ఉంటుందనే భరోసా. దీంతో అలేఖ్య రెడ్డి తప్పకుండా గెలుస్తారనే పుకార్లు, షికారు చేస్తున్నాయి