NRI-NRT

సౌదీలో రాయలసీమ నర్సుకు అత్యున్నత పురస్కారం

సౌదీలో రాయలసీమ నర్సుకు అత్యున్నత పురస్కారం

రోగులకు అత్యున్నత సేవలందించినందుకు అంతర్జాతీయంగా ఇచ్చె ప్రతిష్ఠాత్మకమైన డేసీ ( డీసిస్ అటాకింగ్ మరియు ఇమ్యూన్ సిస్టం) ఆవార్డును సౌదీ అరేబియాలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో పని చేసే కడప జిల్లా మద్దనూర్ కు చెందిన రాచమల్లు లక్ష్మీదేవి కు ప్రధానం చేసారు.
ఏటా అయిదు లక్షల ఔట్ పేషంట్లు, 30 వేల ఇన్ పేషంట్లతో 1200 బెడ్ల సామర్ధ్యం కల్గిన సౌదీ అరేబియాలోని రియాధ్ నగరంలోని కింగ్ ఫహాద్ మెడికల్ సిటీలోని అత్యవసర విభాగంలో నర్సింగ్ విభాగానికి అధిపతిగా పని చేస్తున్న లక్ష్మి దేవి దేశంలోని ప్రముఖ భారతీయ నర్సులలో ఒకరు. కోవిడ్ కష్ట కాలంలో అనేక మంది భారతీయులకు అమె విరోచితంగా సేవలందించడమె కాకుండ అనేక మంది పేదలకు మనోస్ధైర్యాన్ని నింపారు.
సౌదీలో గత 17 సంవత్సరాలుగా రోగులకు తన పరధికు మించి మానవత కోణంలో సహాయమందించె అమె కోవిడ్ కష్ట కాలంలో అనేక మంది రోగులకు అపన్న హస్తమందించారు. 33 రోజులు ఐసియులో గడిపిన ఒక పాశ్చత్య దేశస్ధుడయిన రోగి అమె సేవ రీతిను చూసి వ్యక్తం చేసిన అభిప్రాయంతో అమెకు ఆ ఆవార్డు దక్కింది. గతంలో కూడ అమెకు తెలుగు సంఘాలతో పాటు ఆసుపత్రి వర్గాలు కూడ సన్మానించాయి.