నందమూరి తారకరత్న ఇటీవల కొద్దిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే తారకరత్న చనిపోయేసరికి.. అటు నందమూరి ఫ్యామిలీలో.. ఇటు నందమూరి అభిమానులలో విషాదం నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో.. తారకరత్న పెద్ద కర్మ(దశదిన కర్మ) నిర్వహించారు కుటుంబ సభ్యులు.
సినీ నటుడు నందమూరి తారకరత్న ఇటీవల కొద్దిరోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే తారకరత్న చనిపోయేసరికి.. అటు నందమూరి ఫ్యామిలీలో.. ఇటు నందమూరి అభిమానులలో విషాదం నెలకొంది. తారకరత్న మృతితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి భర్త తిరిగిరాడనే విషయాన్నీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. తారకరత్న చనిపోయిన మూడు రోజులకే ఆయన పుట్టినరోజు కావడం.. అదేరోజు ఆయన చిన్నకర్మ జరగడం ఎంతో బాధకు గురి చేసింది.
చిన్నకర్మ రోజు భర్తను తలచుకొని ఎమోషనల్ పోస్టులు కూడా పెట్టింది అలేఖ్య రెడ్డి. భర్త కోసం ఆమె పెట్టిన పోస్టు అందరినీ ఎంతో కదిలించింది. ఈ క్రమంలో తాజాగా ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో.. తారకరత్న పెద్ద కర్మ(దశదిన కర్మ) నిర్వహించారు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమానికి నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో పాటు రాజకీయ ప్రముఖులు చంద్రబాబు నాయుడు, విజయసాయి రెడ్డి, పురందేశ్వరి.. ఇతర ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి భర్తను తలచుకుంటూ ఎమోషనల్ అయిపోయింది. ప్రస్తుతం తారకరత్న పెద్దకర్మకు సంబంధించి విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.