చంద్రగిరి: తెదేపా (TDP) అధికారంలోకి వస్తే ముస్లింకు ఆర్థికంగా అండగా ఉంటామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు..
‘యువగళం’ పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా చంద్రగిరిలో ముస్లింలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెదేపా అధికారంలోకి రాగానే ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని లోకేశ్ ప్రకటించారు. జగన్ పాలనలో ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేశారని.. ఈ ప్రభుత్వాన్ని సాగనంపుదామని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు సీఎం అవ్వగానే గతంలో ఇచ్చిన విధంగా రంజాన్ తోఫా, దుల్హన్, విదేశీ విద్య సహా అన్ని రకాల సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తామని లోకేశ్ తెలిపారు.