NRI-NRT

ఆస్టిన్ లో అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

ఆస్టిన్ లో అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలను ఆదివారం Austin-Texas లో Austin NRI TDP విభాగం ఘనంగా నిర్వహించింది.

ఈ వేడుకకు 450 మందికి పైగా ఎన్టీఆర్ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ నృత్యాలు, స్వరాంజలి టీం పాడిన పాటలు మరియు NTR జీవిత విశేషాలతో కూడిన బింగో, క్విజ్ ట్రివియా ఆటలు అభిమానులను ఎంతగానో అలరించాయి.


తన స్వాగత ప్రసంగంలో Austin NRI TDP అధ్యక్షులు శ్రీ లెనిన్ ఎర్రం గారు మాట్లాడుతూ సినీరంగం లో మరియు రాజకీయరంగం లో NTR సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా US NRI TDP విభాగం కన్వీనర్ శ్రీ కోమటి జయరాం గారు పాల్గొని సభనుద్దేశించి ప్రసంగించారు. అన్ననందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ, అయన ఆశయాలను, తీసుకున్న వినూత్న నిర్ణయాలను రాబోయే తరానికి తెలియజేసారు.

ఈ కార్యక్రమాన్ని Austin NRI TDP టీం లోని ప్రతి సభ్యుడు స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతు కృషి చేసి విజయవంతంగా ముగించారు.