తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చిన టీటీడీ ధర్మప్రచార పరిషత్ సలహాదారు పదవిని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించారు. సలహాలు ఇవ్వడానికి పదవులు అవసరం లేదని చెప్పారు. టీటీడీకి అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ ముందుంటానని తెలిపారు. తన ఊపిరే వేంకటేశ్వరస్వామి అని, ఆయన సేవ చేసుకోవడం అదృష్టంగా భావిస్తానని.. అందుకు పదవులు అక్కర్లేదని చాగంటి ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
TTD పదవిని తిరస్కరించిన చాగంటి
