మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈనెల 6న విచారణకు హాజరుకావాలని పులివెందులలోని ఆయన ఇంటికెళ్లి అధికారులు నోటీసులు అందించారు. ఇప్పటికే హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో అవినాశ్ను రెండుసార్లు విచారించిన విషయం తెలిసిందే.