Business

మార్కెట్లో నకిలీ 2000 కరెన్సీ నోట్లు ఉన్నాయ్.. ఏది అసలో.. ఏది నకిలీయో తెలుసుకోవడం చాలా సింపుల్

మార్కెట్లో నకిలీ 2000 కరెన్సీ నోట్లు ఉన్నాయ్.. ఏది అసలో.. ఏది నకిలీయో తెలుసుకోవడం చాలా సింపుల్

గత కొన్ని సంవత్సరాలుగా రూ. 2000 నోట్లు మార్కెట్ నుంచి మాయం అయ్యాయి. అయినప్పటికీ, ఇఫ్పటికీ 2000 రూపాయల నోట్లు కొన్ని పెద్ద లావాదేవీల్లో కనిపిస్తున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా రూ. 2000 నోట్లు మార్కెట్ నుంచి మాయం అయ్యాయి. అయినప్పటికీ, ఇఫ్పటికీ 2000 రూపాయల నోట్లు కొన్ని పెద్ద లావాదేవీల్లో కనిపిస్తున్నాయి. నిజానికి 2016లో నోట్ల రద్దు తర్వాత రూ. 2000 నోట్లు చలామణిలోకి వచ్చాయి. ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి. ఈ నోటుకు నకిలీ నోట్లను తయారు చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ రూ. 2000 నకిలీ నోట్లకు సంబంధించిన వార్తలు అడపదడపా వస్తూనే ఉన్నాయి

అయితే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకారం 2000 రూపాయల అసలు కరెన్సీ నోటులో మొత్తం 17 ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫీచర్లను సరిపోల్చుకోవడం ద్వారా మీరు నకిలీ నోట్లను ఇట్టే పట్టేయవచ్చు.

17 ఫీచర్ల పూర్తి వివరాలను తెలుసుకుందాం:
నోటు ముందు భాగం ఇలా ఉంటుంది.

1- 2000 నోటు పరిమాణం- 66× 166 మిమీ.

2- సెక్యూరిటీ థ్రెడ్‌పై భారతదేశం, RBI, 2000 మూడు పదాలు వ్రాసి ఉంటాయి.

3- మెజెంటా అంటే ఎరుపు, వైలెట్ కలర్.

4- 2000 వాటర్‌మార్క్.

5-నోటు విలువ దేవనాగరిలో వ్రాసి ఉంటుంది.

6-మహాత్మా గాంధీ చిత్రం.

7-నోటుపై గాంధీజీ చిత్రపటానికి చాలా దగ్గరగా లోగో ఉంటుంది.

8-నోటును వంచినప్పుడు, సెక్యూరిటీ త్రెడ్ రంగు ఆకుపచ్చ నుండి నీలం రంగులోకి మారుతుంది.

9- మహాత్మా గాంధీ సిరీస్‌లోని కొత్త నోట్‌పై ఆర్‌బిఐ గవర్నర్ సంతకం ఉంటుంది.

10- కుడి వైపు అశోక స్తంభం

నోటు రివర్స్ సైడ్ ఇలా ఉంటుంది:

11- మీరు నోటు వెనుక వైపు చూస్తే, దాని ముద్రణ సంవత్సరం, ఎడమ వైపున ముద్రించి ఉంటుంది.

12- నోటు మధ్యలో మంగళయాన్ చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది.

13- స్వచ్ఛ భారత్ లోగో.

దృష్టి లోపం ఉన్నవారికి:

14- నోట్ ముందు భాగంలో ఎడమ, కుడివైపు 7 లైన్లు ఉంటాయి.

15- 2000 దీర్ఘచతురస్రాకార ఆకారంలో పెరిగిన అక్షరాలతో వ్రాసి ఉంటుంది.

16- మహాత్మా గాంధీ ఎంబాస్ చిత్రం.

17- అశోక స్తంభం ఎంబాస్ చేసిన చిత్రం.