వసంతోత్సవంనవమి కల్యాణ తలంబ్రాల తయారీకీ శ్రీకారం
తొలిసారి మిథిలాస్టేడియం వద్ద నిర్వహణ
భద్రాచలం, మార్చి 6: హోలీపౌర్ణమి సందర్భంగా భదాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో మంగళవారం డోలోత్సవం, వసంతోత్సవాన్ని నిర్వహించనుండగా ఇందుకుసంబంధించి సోమవారం అంకురార్పణ చేశారు. ఈ నెల 22నుంచి ఏప్రిల్ 5 వరకు శోభకృత నామ సంవత్సర వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. 30న శ్రీరామనవమి రోజు మిథిలా స్టేడియంలో స్వామివారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు.