సోమర్సెట్: మార్చ్ 6: అమెరికాలో తెలుగుజాతి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా న్యూజెర్సీలో బాలల సంబరాలు నిర్వహించింది. బాలల్లో ప్రతిభను వెలికి తీసి వారిని ప్రోత్సాహించేందుకు నిర్వహించిన బాలల సంబరాలకు మంచి స్పందన లభించింది.
ఈ సంబరాల్లో రెండు వందల పైగా తెలుగు బాల, బాలికలు పాల్గొన్నారు. తెలుగు పద్యాలు, తెలుగు జియో పార్డీ, గణిత ఛాలెంజ్, మన పండగలు థీమ్‌గా ఉన్న పోస్టర్, క్లాసికల్ డ్యాన్స్, సెమీ క్లాసికల్ డ్యాన్స్, నాన్ క్లాసికల్ సింగింగ్, క్లాసికల్ సింగింగ్, ఫ్యాన్సీ డ్రెస్ వంటి అంశాల్లో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో విజేతలందరికీ నాట్స్ ట్రోఫీల ప్రదానం చేసింది. బాలల సంబరాల్లో పాల్గొన్న వారందరికీ ధ్రువీకరణ పత్రాలను నాట్స్ అందచేసింది. ఇరవై మందికి పైగా నాట్స్ సీనియర్ వాలంటీర్ల, మరో ఇరవై మంది యువ వలంటీర్ల సాయంతో బాలల సంబరాలు ఘనంగా జరిగాయి. నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ఆధ్వర్యంలో, కల్చరల్ ఛైర్ శ్రీదేవి జాగర్లమూడి, కల్చరల్ వైస్ చైర్ బిందు యలమంచిలి, ఉమ మాకం, శ్రీదేవి పులిపాక, జయ చిక్క, లావణ్య తొడుపునూరి, స్వర్ణ గడియారం, ప్రణిత పగిడిమర్రి, గాయత్రి చిట్టేటి, అనుజ వేజళ్ల, సమత కోగంటి, కళ్యాణి దేశపాండే, హరి బుంగటావుల, శ్రీమన్ పుల్లఖండం,
సురేష్ మాకం, రమణ ఎలమంచిలి, శ్రీనివాస్ తొడుపునూరి, నాగేశ్వర్ ఐతా, వెంకట్ జాగర్లమూడి, న్యూ జెర్సీ సమన్వయ కర్త బస్వశేఖర్ షంషాబాద్ పోటీలను చక్కగా నడిపించారు.
బాలల సంబరాలను నాట్స్ చక్కగా నిర్వహించందని ఈ పోటీల్లో పాల్గొన్న చిన్నారుల తల్లిదండ్రులు ప్రశంసల వర్షం కురిపించారు. బాలల సంబరాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.