Movies

అఖిల్ తో ర‌చ్చ చేస్తున్న‌ యంగ్ బ్యూటీ.. అక్కినేని వారి చిన్న కోడ‌లు ఆమేనా?

అఖిల్ తో ర‌చ్చ చేస్తున్న‌ యంగ్ బ్యూటీ.. అక్కినేని వారి చిన్న కోడ‌లు ఆమేనా?

టాలీవుడ్ యంగ్ హీరోల్లో అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ఒక‌డు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న చేసింది నాలుగే సినిమాలు.. అందులో మూడు ఫ్లాప్ అవ్వ‌గా ఒక‌టి మాత్ర‌మే విజ‌యం సాధించింది. త్వ‌ర‌లోనే అఖిల్ నుంచి `ఏజెంట్‌` అనే పాన్ ఇండియా చిత్రం రాబోతోంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ మూవీ ఇది. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే అఖిల్ కు ఉన్న‌ లేడీ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

యువ హీరోల్లో ఎవ‌రికీ లేనంత అమ్మాయిల ఫాలోయింగ్ అఖిల్ కి ఉంది. కానీ, అఖిల్ మాత్రం త‌న ఫోక‌స్ మొత్తానికి సినిమాలపైనే పెట్టాడు. ఇక‌పోతే అఖిల్ కు క్రికెట్ అంటే మ‌హా ఇష్టం. బాల్యం నుండి క్రికెట్ లో శిక్షణ తీసుకున్నాడు. అయితే సెలబ్రెటీ క్రికెట్ లీగ్ 2023(Celebrity Cricket League 2023) ఇటీవలే ఆరంభమైంది. వివిధ భాషల చిత్రసీమల జట్లుగా ఏర్పడి ఆడుతున్న ఈ టోర్నీ ఐపీఎల్ మ్యాచ్‌లను తలపిస్తోంది.

ఆదివారం నాడు తెలుగు వారియర్స్-కేరళ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తెలుగు వారియర్స్ తరపున అఖిల్‌ అల్లాడించేశాడు. 30 బంతుల్లోనే 91 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. వరుస పెట్టి ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్టేడియాన్ని హోరెత్తించాడు. అయితే అఖిల్ గ్రౌండ్ లో బీభత్సం చేస్తుండగా నటి ప్రణవి మానుకొండ(Pranavi Manukonda) తెగ ఎంజాయ్ చేసింది. ఆయన బౌండరీలు బాదుతుంటే ఎగిరి గంతులు వేస్తూ తెగ ర‌చ్చ చేసింది. అంద‌రి చూపులు త‌న‌పై ప‌డేలా చేసింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌ణ‌వి త‌న ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకుంటూ.. సీసీఎల్ మ్యాచ్ ల‌ను బాగా ఎంజాయ్ చేశాన‌ని పేర్కొంది. ఈమె షేర్ చేసిన వీడియోలో ప్ర‌ణ‌వి, అఖిల్(Akhil) హైలెట్ గా నిలిచారు. ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు అక్కినేని వారి చిన్న కోడ‌లు ప్ర‌ణ‌వినే అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ప్ర‌ణ‌వి.. సూర్యవంశం, గంగ మంగ వంటి పాప్యులర్ సీరియల్స్ లో నటించింది. ప్ర‌స్తుతం హీరోయిన్ గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.