Business

2024 మారుతి డిజైర్‌: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో, అతి తక్కువ ధరలో!

2024 మారుతి డిజైర్‌: స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్‌తో, అతి తక్కువ ధరలో!

మారుతి సుజుకి తన పాపులర్మోడల్ కారు

నెక్స్ట్ జెనరేషన్ మారుతి డిజైర్ సరికొత్త హైబ్రిడ్ ఇంజీన్ లాంచ్ చేయనుంది. తాజాగా నివేదికల ప్రకారం కొత్త డిజైన్, కొత్త అప్డేట్స్తో 2024 మారుతి సుజుకి డిజైన్ను లాంచ్ చేయనుంది. హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్తో లాంచ్ చేయనున్న బ్రాండ్ లైనప్ డిజైర్ మొదటి కాంపాక్ట్ సెడాన్ కానుంది.

2024 ప్రథమార్థంలో భారత మార్కెట్లో కొత్త డిజైన్ను విడుదల చేయాలని భావిస్తోంది కంపెనీ. రానున్న న్యూజెన్ డిజైర్ కాంపాక్ట్ సెడాన్ భారతీయ మార్కెట్లో అత్యంత ఇంధన- సమర్థవంతమైన కార్లలో ఒకటిగా ఉంటుందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. ఇది హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లకు గట్టిపోటీగా మార్కట్లోకి ప్రవేశించనుంది. ఈ హైబ్రిడ్ పవర్ యిన్ లీటరుకు 35కి.మీకంటే ఎక్కువ ఇంధన సామర్థ్యంతో దేశంలో అతి తక్కువ ఖరీదుతో బలమైన-హైబ్రిడ్ వాహనం డిజైర్ కానుందని అంచనా.

మూడు ఇంజీన్ వేరియంట్లు 2024 డిజైర్ మూడు ఇంజన్ ఎంపికలతో లాంచ్ కానుంది.1.2L NA పెట్రోల్ ఇంజీన్, 1.2L స్ట్రాంగ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజీన్, 1.2 లీటర్ల సీఎన్బీ (Z12E) ఇంజీన్ ఉన్నాయి

ఫీచర్లు:

ఎక్స్టీరియర్గా పునర్నిర్మించిన ఫ్రంట్ ఫాసియాతో పాటు, ఓడిజైన్ చేయబడిన ఫ్రంట్ బంపర్, భారీ ఫ్రంట్ గ్రిల్, ప్రొజెక్టర్ LED హెడ్లైట్లు, LED టెయిల్ లైట్లు, మెషిన్ -కట్ అల్లాయ్ వీల్స్ ఇతర ఫీచర్లు ప్రధానంగా ఉండనున్నాయి. అలాగే సౌకర్యవంతమైన క్యాబిన్, బిగ్ టన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ “ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హెడ్స్ అప్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లెమేట్ కంట్రోల్ అండ్ కూల్డ్ స్టోరేజ్ కన్సోల్ ప్రధానంగా ఉండనున్నాయి. మొబైల్ కనెక్టివిటీ ఫీచర్లతో పాటు సరికొత సుజుకి కనెక్ట్ టెక్నాలజీని కూడా ఇందులో పొందుపర్చనుంది. మారుతి అరేనా డీలర్షిప్ ద్వారా అందుబాటులోకి రానున్న ఈ కారు ప్రస్తుత మోడల్ పోలిస్తే రూ. 80వేలు లేదా రూ. 1 లక్ష ఎఎక్కువ ధరనిర్ణయించవచ్చని భావిస్తున్నారు. మారుతి డిజైర్ బేస్ మోడల్ ధర రూ. 6.44 లక్షలు