Movies

పెళ్లి తరువాత దూకుడు పెంచిన కాజల్

పెళ్లి తరువాత దూకుడు పెంచిన కాజల్

టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ఏ భాషలో సినిమా చేసినా కూడా ఆ వర్గం ప్రేక్షకులకు బాగా దగ్గరయిపోతుంది. ఆమె టాలీవుడ్ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో దాదాపు అందరూ అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేసింది. ముఖ్యంగా తెలుగులో అయితే కెరీర్ మొదటి నుంచి కూడా ఆమె పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేసింది.

ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో గ్లామర్ మాత్రమే కాకుండా యాక్టింగ్ కూడా హైలెట్ అయ్యే విధంగా కాజల్ జాగ్రత్తలు తీసుకునేది. ముఖ్యంగా కొన్ని రొమాంటిక్ లవ్ స్టోరీలలో కాజల్ నటించిన విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె కెరీర్లో తెలుగులో అయితే మగధీర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఎంతో హార్డ్ వర్క్ చేసి స్టార్ హోదా అందుకున్న కాజల్ అగర్వాల్ మూడేళ్ళ క్రితం వివాహం చేసుకుంది.

అయితే ఆమెకు ఒక బాబు కూడా జన్మించాడు. ఇక తల్లి అయిన తర్వాత కాజల్ మళ్ళీ సినిమాలు చేయదేమో అని అందరూ అనుకున్నారు. కానీ కాజల్ ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా మళ్ళీ సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా బిజీగా మారిపోయింది. కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తమిళంలోనే గోస్ట్ అనే మరొక సినిమా కూడా చేస్తోంది.

మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు కదా… వెంకటేష్ కామెడీ సూపర్ ఇక తెలుగులో నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోయే సినిమాలో కూడా కాజల్ ఒక పాత్రలో కనిపించబోతోంది. అలాగే బాలీవుడ్లో ఉమా అనే ఒక డిఫరెంట్ సినిమాలో ఆమె నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఆమె ప్రతి సినిమాకు కూడా కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా పెళ్లి అయిన తర్వాతనే చాలామంది హీరోయిన్స్ రిటైర్మెంట్ ఇస్తున్న తరుణంలో ఇప్పుడు కాజల్ మాత్రం మళ్లీ విభిన్నమైన పాత్రలతో మంచి ఆదాయాన్ని అందుకుంటూ బిజీ బిజీగా మారిపోయింది.