Politics

మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం ముఖ్యాంశాలు

మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం ముఖ్యాంశాలు

మోడీ సర్కార్ చేచేతిలో ఈడీ కీలుబొమ్మ.. సిబిఐ తోలుబొమ్మ

మంత్రి గంగుల కమలాకర్ మంత్రి మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్ గారి ఇంటి మీద ఐటి, ఈడీ అధికారులతో దాడులు చేపించింది మోడీ సర్కార్. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి గారి మీద ఐటీ ఐటీ దాడులు జరిగాయి.

బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు గారు మరియు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారి, పార్థసారధి రెడ్డి, లోక్ సభ సభ్యులు మన్నె శ్రీనివాస్ రెడ్డి శాసనమండలి సభ్యులు ఎల్ రమణ, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మీద ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 12 మంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.

ఇదే క్రమంలో నిన్న ఎమ్మెల్సీ కవిత గారికి ఈడీ పంపించింది. ఇక్కడ దేశ ప్రజలు గమనించాల్సిందేమిటంటే ఇది ఈడీ సమన్లు కాదు మోడీ సమన్లుగా భావించాలి.

మోడీ సర్కార్ చేచేతిలో ఈడీ కీలుబొమ్మ.. సిబిఐ తోలుబొమ్మ గా మారాయి.

మోడీ ప్రభుత్వానికి తెలిసింది ఒకటే.. అయితే జూమ్లా లేదంటే హమ్లా.

నీతిలేని పాలనకు.. నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు పర్యాయపదంగా మారింది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం.

ప్రతిపక్షాల మీద కేసుల దాడి, ప్రజల మీద ధరల దాడి.. ఇది తప్ప ఈ తొమ్మిదేళ్లలో మోడీ సర్కార్ సాధించింది ఏమీ లేదు.

గౌతమ్ ఆధాని అనే వ్యక్తి ఎవరి బినామో దేశంలోనే చిన్న పిల్లగాడిని సైతం అడిగిన చెబుతాడు. ఆయన మోడీ గారి బినామీ దేశ ప్రజలకు తెలియంది కాదు

దేశాన్ని కుదుపు కుదిపేసిన హిండెన్ బర్గ్ నివేదిక.. 13 లక్షల కోట్ల ఎల్ఐసి, ఎస్బిఐ వంటి ప్రజలకు చెందిన సంస్థల డబ్బులు ఆవిరైనా .. ఈ దేశ ప్రధానమంత్రి ఉలకడు పలకడు. దేశ ఆర్థిక మంత్రికి కనీసం చీమకుట్టినట్టు కూడా కాదు.

ఒక సంస్థకు రెండు ఎయిర్ పోర్టులకంటే ఎక్కువ కాంట్రాక్టు కట్టబెట్టొద్దు అని ఇప్పటిదాకా ఉన్న నిబంధనలను తుంగలో తొక్కి.. గౌతమ్ అదానికి ఆరు ఎయిర్పోర్ట్లు కట్టబెట్టడం
ఎంతవరకు సమంజసం ? ఇది తప్పు అని సాక్షాత్తు నీతి ఆయోగ్ తన నివేదికలో తెలిపింది.

ఒక వ్యక్తికి అనుకూలంగా నిబంధనలను మార్చి ఆయనకు ఆర్థిక లబ్ది చేకూరేలా.. వ్యవహరిస్తూ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నది మోడీ ప్రభుత్వం.

గౌతం అదానీ ఆధీనంలోని గుజరాత్ లోని ముంద్రా పోర్టులో 3000 కిలోల అంటే దాదాపు 21 వేల కోట్ల విలువైన హెరాయిన్ పట్టుబడితే ఒక్క కేసు నమోదు కాలేదు. . గౌతమ్ ఆదానిని ప్రశ్నించే దమ్ముందా కేంద్ర ప్రభుత్వానికి ?

మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్లు వాషింగ్ పౌడర్ నిర్మా.. అంటే గంగలో మునిగినోళ్లు పునీతులు అయిపోతారు అన్నట్టు బిజెపిలో చేరగానే వారి యొక్క పాపాలు వారి మీద ఉన్న కేసులు వెంటనే పోతాయి

వైయస్ సుజనా చౌదరి కి చెందిన షేల్ కంపెనీల ద్వారా లగ్జరీ కార్లు కొనుగోలు చేశారని ఈడి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది

సుజనా చౌదరికి చెందిన సెల్ కంపెనీల ద్వారా వేల కోట్ల బ్యాంకు ఫ్రాడ్ జరిగిందని కూడా ఈడి తెలిపింది. కానీ వెంటనే సుజనా చౌదరి బిజెపిలో చేరడంతో ఆ కేసులు నీరు గారాయి.

బిబిసి వంటి అంతర్జాతీయ మీడియా సంస్థల మీద దాడులు చేయడం ద్వారా తమకు అనుకూలంగా లేకపోతే మీడియా సంస్థల మీద ఎలాంటి చర్యల కైనా సిద్ధం అని మీడియా సంస్థలకు ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చిండు మోడీ.

నిన్నగాక మొన్న జరిగిన టి20 సదస్సులో పాల్గొనడానికి వచ్చిన శ్రీలంక ఆర్థిక మంత్రి ఆదానికి శ్రీలంకకు మధ్య జరిగిన ఆరువేల కోట్ల ఒప్పందాన్ని జి టు జి ఒప్పందంగా పేర్కొన్నాడు. జి టు జి అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదు గౌతమ్ ఆదాని టు గొటబయ అని అర్థం.

ఆదాని కంపెనీ నరేంద్ర మోడీ సొంత కంపెనీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆదానికోసం తిరిగి ప్రధాన హోదాలో మార్కెటింగ్ చేస్తున్నాడు నరేంద్ర మోడీ.

మోడీ పాలనలో ఈడీ దాడులు 95 శాతం విపక్షాల మీదనే జరుగుతున్నాయి. ఈ తొమ్మిదేళ్లలో ప్రతిపక్షాల మీద పెట్టిన ఈడీ నమోదు చేసిన కేసుల సంఖ్య 5422. అందులో కేవలం 23 కేసుల్లో మాత్రమే తీర్పు వచ్చింది. ఈ లెక్కన దర్యాప్తు ఈడీ వంటి సంస్థలతో దాడులు చేయించి మోడీ సర్కార్ ఏం చేస్తుందో దేశ ప్రజలు గమనిస్తున్నారు.

నిన్నగాక మొన్న కర్ణాటకలో బిజెపి ఎమ్మెల్యే విరూపాక్ష కొడుకు 40 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. దానిమీద ఎలాంటి దాడులు ఉండవు.

మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ పాటిల్ అనే వ్యక్తి.. నేను బిజెపి లో చేరాను కాబట్టి నా మీదకు ఈడీ రాదు అని చెప్పిన విషయం టీవీల్లో సైతం ప్రసారం అయింది. కాంగ్రెస్ నుండి గెలిచి బిజెపిలోకి వెళ్ళిన హర్షవర్ధన్ అనే ఎంపీ బిజెపి లోకి వచ్చిన తర్వాత హాయిగా నిద్రపోతున్నానని ఈడీ నుంచి ఉపశమనం లభించిందని చెప్పిండు.

ఈ లెక్కన అసలు దేశంలో ఏం జరుగుతుంది ?

తొమ్మిది రాష్ట్రాల్లో దొడ్డిదారిన మోడీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చింది నిజం కాదా ?
పెద్ద ఎత్తున పార్టీలను చీల్చిన విషయం నిజం కాదా ?

డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అంటూ ఊదరగొడుతున్న బిజెపి ప్రభుత్వం అసలు రూపం దేశ ప్రజలకు నేడు అర్థం అయింది. ఒక ఇంజిన్ మోడీ అయితే మరో ఇంజన్ ఆదాని. ఆ ఇంజన్ పేరు “మాదాని”.. అంటే మోడీ, అదానీ అని అన్నమాట.

మన తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల్లో 18 వేల కోట్లు కాంట్రాక్టు కట్టబెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని మీ పార్టీలోకి లాక్కున్నది వాస్తవం కాదా

విదేశీ బొగ్గును మేమెందుకు కొనాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రశ్నించారు అంతేకాదు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి కూడా ప్రశ్నించడం జరిగింది. ఇది ఒక వ్యక్తి కోసం పాలసీ మార్చడం కాదా ? అదాని బొగ్గు కోసం మోడీ సర్కార్ చేస్తున్న మార్కెటింగ్ కాదా ?

ఆదానికి కట్టపెట్టే లాభాలకు దాన్ని ప్రతిఫలంగా బిజెపి పార్టీకి వచ్చే చందాల కోసం.. ఆ చందాల నుండి చేయాలనుకునే దందాల కోసం చేస్తున్న కుట్ర.

మోడీ తొమ్మిందేండ్ల పాలనలో దొడ్డి దారిన రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చింది నిజం కాదా ?

ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కాంట్రాక్టులు పదవుల పేరుతో లొంగదీసుకున్నది అబద్ధమని చెప్పగలరా ?

పశ్చిమ బెంగాల్లో వేల కోట్ల కుంభకోణంలో ఇరుక్కున్న తృణమూల్ నేత సువేందు అధాకారిని విచారణల పేరుతొ భయపెట్టి.. మీ పార్టీలో చేర్చుకున్న తరువాత విచారణ ఎందుకు ముందుకు సాగలేదు ?

ఏపీలో బ్యాంకులకు వందల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లు మీ పార్టీలో చేరగానే పునీతులు అయ్యారా ?

శారదా కుంభకోణం ప్రధాన నిందితుడు హిమంత బిస్వా శర్మ బిజెపిలో చేరిన తరువాత ED/CBI అతనిపై దర్యాప్తును ఎందుకు నిలిపివేసింది.

నమ్ముకున్న ప్రజల కోసం బీజేపీ వైఫల్యాలను ఎండగట్టిన పాపానికి ప్రాంతీయ పార్టీల నేతల మీద కేసుల పేరుతో వేధిస్తున్నది నిజం కాదా ?

అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో సీబీఐ / ఈడీ లాంటి విచారం సంస్థలు ఒక్క ప్రతిపక్ష నేతలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి ?

ఒకవేళ పై ప్రశ్న అబద్దమే అయితే.. ఎంతమంది బీజేపీ నాయకుల మీద సీబీఐ / ఈడీ కేసులను నమోదు చేసిందో చెప్పగలరా ?

ఉద్యమనేత బిడ్డగా.. పుట్టుకనుండే చైతన్యాన్ని పుణికి పుచ్చుకున్న ఉద్యమకారురాలు ఎమ్మెల్సీ కవిత మీద విషయంలో ఈడీ పేరుతో వేధింపులు కేసీఆర్ గారిని టార్గెట్ చేయడానికి కాదా ?

ఢిల్లీలో మీకు కంట్లో నలుసులా తయారైన ఆప్ సర్కార్ మీద కుట్రలో భాగంగానే మనీష్ సిసోడియా అరెస్ట్ అన్నది దేశ ప్రజలకు తెలియదని మీరు అనుకుంటున్నారా ?

లక్షల కోట్ల జనం సొమ్మును బ్యాంకులు ద్వారా లోన్లు తీసుకొని.. ఈరోజు నిండా ముంచిన అదానీ విషయంలో ఈడీ, సీబీఐలు ఎందుకు విచారణ చేయడం లేదు ?

మీ మోడీ – అదానీ చీకటి స్నేహం వెనుక దాగి ఉన్న ఆంతర్యం ప్రజలకు తెలియదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా ?

మీరు పాలిస్తున్న కర్ణాటకలో 40 శాతం కమీషన్ పేరుతో మంత్రులు ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతికి విసిగిపోయి కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుంటున్నది నిజం కదా ?

ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారు అని మోడీ సర్కారును సూటిగా ప్రశ్నించారు మంత్రి కేటీఆర్