అమిత్ షా కుమారుడు జైషా పై ఉన్న ఆ సిబిఐ కేసులు ఏమయ్యాయి..
తమ దారికి రాకపోతే ఇ.డి.ప్రయోగమా ?
భారత దేశంలో ప్రజా స్వామ్యం వెల వెల బోతుంది. దర్యాప్తు సంస్థలు అన్నీ హోంమంత్రి గుప్పిట్లో ఉంటున్నాయి.
కేంద్ర మంత్రి అమిత్ షా కొడుకు జైషాపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
షిర్డీ ఇండస్ట్రీస్ స్కాంలో పీయూష్ గోయెల్‌పై ఆరోపణలు ఉన్నాయి. మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణం, షాబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్, గుజరాత్ అల్లర్లు కేసులను మోదీ సర్కార్ పక్కన పెట్టిందనే వాదన చేస్తున్నాయి మిగతా పక్షాలు. విషయం ఏదైనా అధికార పార్టీ చేతిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలనే కామెంట్లు రావడం ఇప్పుడే కొత్త కాదు. యుపిఏ హయాంలోను వచ్చాయి.
ఎన్డీఏ కాలంలోను కొనసాగుతున్నాయి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే రాజకీయ కుట్ర అంటున్నారని అధికార పార్టీ..కాదు కాదు ఓటమిని జీర్ణించుకోలేక ఈ విమర్శలు అంటున్నాయి విపక్ష పార్టీలు. వీటినేమి పట్టించుకోకుండా రాజకీయాలను పక్కన పెట్టి త్వరితగతిన కేసులను విచారించి అక్రమార్కులకు శిక్ష పడేలా చేస్తేనే భారత ప్రజాసామ్య పరిరక్షణకు మేలు జరిగినట్లు అవుతోంది.
దారిలోకి తెచ్చుకునే మంత్రం.. ఈడీ, ఐటీ, సిబిఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మలా?
ED -CBI
దారిలోకి వస్తే సరే.. లేకపోతే అంతే సంగతులు. ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించడం మనకు తెలిసిందే. భారత రాజకీయాల్లో ఇప్పుడు ఇది బాగా హాట్ టాపికైంది. అధికారంలో ఎవరున్నా కేంద్రంలోని పాలకులపై ఇదే విమర్శలు.
చెప్పింది వింటే సరేసరి. లేకపోతే వారి పై ED కేసులు, CBI కేసులు, IT సోదాలు షరామూములు వ్యవహారమైందనే విమర్శలొస్తున్నాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఇదే పని చేసిందనే ఆరోపణలు రాగా..ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పైనా అదే తరహా విమర్శలు గుప్పుమంటున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాలకు ఈడీ, ఐటీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కీలుబొమ్మలుగా కేంద్రం వాడుకుంటోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ‘గతంలోఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన సమయంలో ఇడి కేసులు రావడం గమనార్హం.
. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచించడం మాములు విషయమే. కాకపోతే ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరుగుతున్న పరిణామాలను సాకుగా చూపడం ఆసక్తికరం.
మన దేశంలో కేసులు ఎన్ని ఉన్నాయంటే…
భారతదేశవ్యాప్తంగా మొత్తం 121మంది ప్రజాప్రతినిధులపై సీబీఐ కేసులున్నాయి. 122 మంది నేతలపై ఈడీ కేసులుండటం మాములు విషయం కాదు.
ఎంపీ, ఎమ్మెల్యేలపై ఈ కేసుల విచారణ కొనసాగుతోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది అమికస్ క్యూరీ. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్ లో ఉండటం ఇబ్బందికరమే. ఈ లోపే నేతలు మరోసారి చట్టసభలకు ఎన్నికవుతున్నారు. ఫలితంగా మంచివాళ్లే కాదు..అక్రమార్కులు సభలో అడుగుపెట్టడం ప్రజాసామ్య భారతానికి వన్నె తెచ్చేది కాదు.
*ప్రజా ప్రతినిధుల పైనే
అదానీ అంబానీ ల పై కేసులు ఉండవు!*
భారతదేశంలో సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న 121 మందిలో 14 మంది సిట్టింగ్ ఎంపీలు కాగా..107 మంది మాజీ ఎంపీలు ఉన్నారు. ఓ ప్రజా ప్రతినిధిపై కేసు 20 ఏళ్లకు పైగా కేసు పెండింగ్ లో ఉంది. 121 కేసుల్లో 58 కేసుల్లో జీవిత ఖైదు, 48 కేసుల్లో సుదీర్ఘ కాలం శిక్ష పడే అవకాశం ఉంది. 51 మంది తాజా, మాజీ ఎంపీలపై మనిలాండరింగ్ కేసులు ఉండటం సాధారణ విషయం కాదు.
కేసులను చూపించి బ్లాక్ మెయిలింగ్:-
పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ మేనల్లుడు టీఎంసి ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజీరా బెనర్జీకి ఈడీ నోటీసులిచ్చి విచారించింది. బెంగాల్ బొగ్గు స్కామ్ లో ఆయన పై ఆరోపణలు చేసింది. అంతే కాదు తమిళనాడు సిఎం స్టాలిన్ కూతురు శంతమరాయి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హానీ పై మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈడీ అరెస్టు చేసింది. అక్రమ ఇసుక మైనింగ్ కేసులో భూపేందర్ సింగ్ హనీ పై ఆరోపణలున్నాయి. ఆయన ఇళ్లు, పలు కార్యాలయాల్లో దాడులు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
అంతే కాదు…బీజేపీపై గట్టిగా గళం వినిపించే ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌పై NIA కేసు పెట్టేందుకు సిద్దమైందనే లీకులు వస్తున్నాయి. ఇప్పటికే సిఎం అధికారాలకు కత్తెర వేసి లెప్టెనెంట్ జనరల్ కు బాధ్యతలు అప్పగించారనే వాదనుంది. ముందరి కాళ్లకు బంధం వేసినట్లుగా చేస్తుందంటున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ లోని సమాజ్ వాదీ నాయకుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జోరుగా సాగుతున్నాయి. ఆ పార్టీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారనే వాదనుంది.
ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ లో సిఎం జగన్మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ ఛార్జిషీట్ వేసింది. ఇందులో ఎంపీ అవినాష్ రెడ్డి పేరుపై రగడ రేగుతోంది. ఇప్పటికే అక్రమాస్తుల కేసులో సిఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టులకు హాజరవుతున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారి పై కేసులు రావడం వెనుక సోనియా హస్తం ఉందనే విమర్శలు లేకపోలేదు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ పై నిప్పులు చెరుగుతున్న తీరు చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత సంస్థలు ఈడీలు, సీబిఐలకు నేను భయపడనని బాహాటంగానే చెబుతున్నారు రాహుల్ గాంధీ. 2006లో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు తెలంగాణ సిఎం కేసీఆర్. ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో 2015 అక్టోబర్ 22న సిబిఐ విచారించింది. దీని పై సరైన ఆధారాలు లేకపోవడంతో పక్కన పెట్టేసింది.
బిజెపి పులిమీద సవారీ..:-
నాపై ఎన్ఐఏ కేసు పెడుతున్నట్టు తెలిసింది.. మంచి పనులు చేసేవాళ్లను ఉగ్రవాదులుగా చూస్తారా?ఇదే మీరు చేసేది అంటూ ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తీరు ఆసక్తకరమే. ఆయనే కాదు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేను సైతం అంటున్నారు.
కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తోంది. దేనికైనా రెడీ అంటున్నారు. ఇదంతా పులిమీద సవారీనే. ఎదురుతిరిగితే పోయేదేముంది. కొత్తగా మరిన్ని సీట్లు రావడం తప్పా అంటున్నారు గులాబీ నేతలు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఈడీ, ఎన్ఐఏ, ఐటీ, సిబిఐలు వచ్చినా తగ్గేదేలే అంటున్నారు ఇంకోవైపు తెలంగాణ మంత్రి కే.తారకరామారావు. ఈ దర్యాప్తు సంస్థలు గుజరాత్ మోసాలపై ఎందుకో కేసులు పెట్టవుఅనే అనుమానం వ్యక్తం చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ లాంటి నేతలు. రాష్ట్రంలో ఐటీ ముందుగా వచ్చింది. తర్వాత ఈడీ, సిబిఐ వస్తాయి. ఏం జరుగుతుందో అర్థమవుతోందని యూపీ మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ చెబుతున్న ప్రజల్లో చర్చకు దారితీసింది.
అధికార ప్రభుత్వం చేతిలో సిబిఐ కీలు బొమ్మ అనే కామెంట్లు వస్తున్నాయి. ఎదురు తిరిగితే వారిని దారిలోకి తెచ్చుకునేందుకు సిబిఐతో కేసులు వేయిస్తుందనే వాదనలొస్తున్నాయి. జగన్, చంద్రబాబు, జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్, హర్యానా మాజీ సిఎం భూపేందర్ హుడా, సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా, చిదంబరం వంటి వారు ఈడీ, సిబిఐ, ఐటీ కేసులు ఎదుర్కున్నవారే. మరికొందరి పై ఇంకా కేసులు కొండవీటి చాంతాడులా ఏళ్ల తరబడి కొనసాగుతూనే ఉన్నాయి.
కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా పై కావాలనే కేసులు పెట్టారని కాంగ్రెస్ అంటోంది. ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం మాయావతిపై 12 ఏళ్ల తర్వాత ఈడీ దాడులు పెట్టడం. ఇద్దరు మాజీ మంత్రులు అరెస్టు చేయడం ఎన్నికల వ్యూహం కోసమే అనే వాదన లేకపోలేదు. ఇక కేరళ సిఎం పినరయ్ విజయన్ను సిబిఐ ప్రశ్నించేందుకు సుప్రీంకోర్టు అనుమతి కోరడం వెనుక వ్యూహం కొనసాగుతుందంటున్నారు కామ్రేడ్స్.
బిజెపి దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వెయ్యాలని వ్యూహంలో భాగమే కర్నాటక, తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణలో నేతల పై మనీలాండరింగ్ కేసులు, ఈడీ దాడులు, సిబిఐ ఎంక్వైరీలు అంటున్నాయి విపక్షాలు.
దారిలోకి వస్తే సరే.. లేకపోతే అంతే సంగతులు. ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించడం మనకు తెలిసిందే. భారత రాజకీయాల్లో ఇప్పుడు ఇది బాగా హాట్ టాపికైంది.
దారిలోకి వస్తే సరే.. లేకపోతే అంతే సంగతులు. ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించడం మనకు తెలిసిందే. భారత రాజకీయాల్లో ఇప్పుడు ఇది బాగా హాట్ టాపికైంది. అధికారంలో ఎవరున్నా కేంద్రంలోని పాలకులపై ఇదే విమర్శలు. చెప్పింది వింటే సరేసరి. లేకపోతే వారి పై ED కేసులు, CBI కేసులు, IT సోదాలు షరామూములు వ్యవహారమైందనే విమర్శలొస్తున్నాయి. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఇదే పని చేసిందనే ఆరోపణలు రాగా..ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పైనా అదే తరహా విమర్శలు గుప్పుమంటున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాలకు ఈడీ, ఐటీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను కీలుబొమ్మలుగా కేంద్రం వాడుకుంటోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఈ కేసులు రావడం ఉత్కంఠను పెంచుతోంది. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచించడం మాములు విషయమే. కాకపోతే ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు ఇటీవల జరుగుతున్న పరిణామాలను సాకుగా చూపడం ఆసక్తికరం.