తెలుగు సినిమాను ఎల్లలు దాటించి ప్రపంచ శిఖరంపై నిలబెట్టిన దర్శక దిగ్గజం రాజమౌళి. ఎన్నో హిట్ చిత్రాలను తెరకెక్కించిన ఆయన గతేడాది రూపొందించిన కళాఖండమే RRR. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మల్టీ స్టారర్ గా వచ్చిన ఈ సినిమా యావత్ సినీ లోకం అబ్బురపడేలా చేసింది.
ఇక తాజాగా నాటు నాటు పాటకు ఆస్కార్ (95th Academy Awards) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు సినీ ప్రముఖులు RRR ప్రశంసిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.
మార్చి 13న ఉదయం.. మార్చి 13న సోమవారం ఉదయం అట్టహాసంగా జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో RRR చిత్రాన్ని పురస్కారం వరించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు అవార్డ్ రాగా.. జీ పైకి ఎక్కి మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్ కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ పురస్కారం అందుకున్నారు. దీంతో యావత్ తెలుగు సినీ ప్రేక్షకలోకం సంతోషంలో మునిగిపోయింది. ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న ఎమ్ఎమ్ కీరవాణి తన సంతోషాన్ని పాట రూపంలో తెలియజేశారు.
నీ స్టెప్పులతో.. “ఇది భారతదేశానికి గొప్ప క్షణాలు. అత్యంత ప్రఖ్యాతమైన ఆస్కార్ వేదికపై ఒక తెలుగు పాట ఊపు ఊపడం చాలా గర్వంగా ఉంది. ఎమ్ఎమ్ కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, బ్రదర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, అలాగే నేనుఎప్పుడు ప్రేమించే గ్లోబల్ స్టార్ నా లవ్లీ బ్రదర్ రామ్ చరణ్ కు పెద్ద అభినందనలు. నీ స్టెప్పులతో ప్రపంచాన్నే డ్యాన్స్ చేయించిన తెలుగు వాళ్ల గర్వం తారక్ కు నా శుభాకాంక్షలు. ఈ మ్యాజిక్ సాధ్యమయ్యేలా తెర వెనుక ఉండి నడింపించిన ఎస్ఎస్ రాజమౌళి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. ఇది భారతీయ సినిమాకు హార్ట్ టచింగ్ మూమెంట్” అని బన్నీ తెలిపాడు
లవ్లీ బ్రదర్ అని సరిపెట్టి.. అయితే ఇప్పుడు ఈ ట్వీట్ కూడా కాస్తా హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్ట్ ను ఎక్కువగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రీట్వీట్ చేస్తున్నారు. ఇందులో తారక్ ను బన్నీ ప్రత్యేకంగా అభినందించడంపై సంతోషపడుతున్నారు. కానీ మరోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం కొద్దిగా హర్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పి.. రామ్ చరణ్ గురించి మాత్రం లవ్లీ బ్రదర్ అని సరిపెట్టడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు
వివాదం రాజుకోనుందా.. ఇదే కాకుండా ఆస్కార్ వేదికపై కీరవాణి, చంద్రబోస్ అవార్డ్ తీసుకునే సమయంలో వారి వెనుక ఎన్టీఆర్ ఫొటో చూపించారు. అక్కడ చెర్రీ ఫొటో కనిపించకపోయేసరికి అలా ఎందుకు లేదు అని వీడియోను వైరల్ చేశారు. RRR సినిమాలో తారక్, చెర్రీ ఇద్దరు హీరోలు అయినప్పటికీ ఒక్కరి ఫొటో మాత్రమే చూపించడం ఏంటని ఫైర్ అవుతున్నారట. ఈ విషయాన్ని ఆస్కార్ కమిటీ ఎందుకు పట్టించుకోలేదని పోస్టుల ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పుడు బన్నీ ట్వీట్ మరో వివాదం రాజుకుంటుందా అని పలువురు డౌట్ వ్యక్తం చేస్తున్నారు.