తానా మాజీ అధ్యక్షుడు ప్రముఖ ఎన్నారై జై తాళ్లూరి కుటుంబం తమ స్వగ్రామం భద్రాచలం సమీపంలోని ఇర వెండి గ్రామంలో భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ తండ్రి తాళ్లూరి పంచాక్షరయ్య పేరు మీదుగా చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ తల్లి భారతీదేవి జ్ఞాపకార్థం మండలంలోని రైతులకు ఉపయోగపడే విధంగా గోడౌన్ నిర్మాణానికి విలువైన భూమిని విరాళంగా అందించారు. ఇటీవల ఈ గోడౌన్ స్థానిక శాసనసభ్యుడు రేగా కాంతారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి పంచాక్షరయ్య తో పాటు జై తాళ్లూరి కూడా పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో కోట్లాది రూపాయల విరాళాలతో తాళ్లూరి పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రశంసించారు.