NRI-NRT

చిరునవ్వుల చిరునామా ఫిన్లాండ్

చిరునవ్వుల చిరునామా ఫిన్లాండ్

హ్యాపీనెస్ ర్యాంకుల్లో మరోసారి అగ్రస్థానం

• భారత్కు 125వ ర్యాంకు

న్యూయార్క్: ఫిన్లాండ్ ఎప్పటి మాదిరిగానే ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో అగ్రభాగాన నిలిచింది. ఆరుదఫాలుగా ఆదే స్థానంలో కొనసాగుతోంది. ‘అంతర్జా తీయ ఆనంద దినోత్సవమైన సోమ వారం(మార్చి 20న) యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ తాజా ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 150కి పైగా దేశాల ప్రజల మనోభావాలను. తెలుసుకునే గ్లోబల్ సర్వే డేటా ఆధారంగా రూపొందించిన నివేదిక ఇది. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్ (1), డెన్మార్క్ (2), ఐస్లాండ్ (3) వరుసగా తొలి మూడు ర్యాంకులను దక్కించుకున్నాయి. భారత్ 125వ స్థానంలో నిలిచింది. అయితే, నేపాల్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది.