చెన్నైకు చెందిన ప్రముఖ సాంస్కృతిక సంస్థ కళాసుధ గత 25 సంవత్సరాల నుండి సినిమా రంగంతో పాటు వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులకు అవార్డులను అందజేస్తోంది. దీనిలో భాగంగా తానా ఫౌండేషన్ కార్యదర్శి ప్రముఖ ఎన్నారై వల్లేపల్లి శశికాంత్ కు ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా కళాసుధ అవార్డును ప్రకటించింది.. బుధవారం నాడు ఉగాది రోజున ఈ అవార్డును శశికాంత్ కు అందజేస్తున్నారు. కళాసుధ వ్యవస్థాపకుడు బేతి రెడ్డి శ్రీనివాస్ ఆహ్వాన పత్రాన్ని శశికాంత్ కు అందజేశారు.బుధవారం నాడు ఉగాది సందర్భంగా చెన్నైలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును శశికాంత్ కు అందజేస్తారు..