Health

10,000 దాటిన క్రియాశీల కేసులు.. 134 రోజుల తర్వాత ఇదే అత్యధికం..

10,000 దాటిన క్రియాశీల కేసులు.. 134 రోజుల తర్వాత ఇదే అత్యధికం..

దిల్లీ: దేశంలో కరోనా వైరస్(Coronavirus) గుబులు ఇంకా తొలగిపోలేదు. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం..

24 గంటల వ్యవధిలో 56,551 మందిని పరీక్షించగా..1,805 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. ముందురోజు కూడా ఇదేస్థాయి(1,890)లో కేసులు వచ్చాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా ఉంది..

కొత్త కేసులు పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు(Active Covid cases) 10వేల మార్కు దాటాయి. 134 రోజుల తర్వాత ఇదే అత్యధికం కావడం గమనార్హం. నిన్న ఆరుగురు మరణించారు. ఇప్పటివరకూ 4.47 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.30 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైంది..