* పాక్ తోక వంకర అని మరోసారి రుజువు చేసుకుంటోంది. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే.. సైనిక స్థావరాలు గుట్టు లాగేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం నీచానికి తెగబడుతోంది. ఇండియన్ ఆర్మీకి అమ్మాయిలను ఎరగా వేస్తోంది.కంటికి కనిపించే శత్రువుతో యుద్ధం చేయొచ్చు. కానీ.. జిత్తలమారి నక్కను తలపించే వ్యూహాలతో భారత సైన్యం తలపడాల్సి వస్తోంది. సరిహద్దుల్లో.. వాయుమార్గంలో.. ఏరకంగానూ మనకు పాకిస్తాన్ సరిజోడు కాదు. ఈ విషయం సర్జికల్ స్ట్రైక్ తర్వాత పాపికి బాగా తెలిసొచ్చింది. అందుకే.. ఇతర మార్గాలు అన్వేషిస్తోంది. అందులో ఒకటి హనీట్రాప్.
* అనంతపురం జిల్లా గుంతకల్లు ఎక్సైజ్ సీఐ వెంకటలక్ష్మమ్మపై వేటు పడింది. బెల్ట్‌షాపుల తొలగింపులో నిర్లక్ష్యం వహించారని ఎక్సైజ్ సీఐ వెంకటలక్ష్మమ్మను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
* గుంటూరు భార్య చెవిని కొడవలితో భర్త కోసిన దారుణ ఘటన బుధవారం తాతిరెడ్డిపాలెంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో.. తాడికొండ మండలం తాతిరెడ్డి పాలెంలో బుధవారం తెల్లవారుజామున షేక్.అల్లాబి అనే మహిళ చెవి ని, ఆమె భర్త బాజి కొడవలితో కోశాడు. వెంటనే క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలించారు.
* గత రాత్రి మంగళగిరి లో జరిగిన రౌడీ షీటర్ ఉమాయాదవ్ హత్య లో కేసులో ఐదుగురు వ్యక్తులు డిఎస్పి రామకృష్ణ ఆధ్వర్యంలో లొంగుబాటు.హత్యలో పాల్గొన్న. వారు మొత్తం ఏడుగురు.పోలీసులముందు లొంగిపోయిన ఐదుగురు వ్యక్తులు, తోట శ్రీను, సైదలు, పానయ్య, గోపి, హనుమంతరావు పరారిలో ఇద్దరు నిందుతులుహత్య చేయడానికి కారణాలు వర్గపొరు,భూ వివాదాలు.
* ములుగు జిల్లా వాజేడు మండలం, అరుణాచాలపురం ప్రధాన రహదారి వంతెనపై వెలసిన మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. పొడుభూముల సమస్యలపై పోరాటానికి ఆదివాసీ, గిరిజన తండాలు ఏకం కావాలని మావోయిస్టులు పిలుపు ఇచ్చారు. వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో కరపత్రాలు వెలసాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు
* తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ నందు రాజస్థాని యువకుడి పై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వ్యాపార లావాదేవీలే ఈ దాడికి కారణంగా తెలుస్తుంది.
* చిట్టీ పాటల పేరుతో అమాయకుల నుంచి డబ్బు వసూల చేసి రూ.2 కోట్లకు కుచ్చుటోపి పెట్టిన మహిళపై కేసు నమోదైంది. ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో విజయమ్మ అనే మహిళ చిట్టీల పేరుతో రూ.2కోట్లకు కుచ్చుటోపి పెట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* పిచ్చాటురు మండలం రామగిరి పంచాయతీలో వెలిసియున్న వాయులీగాశ్వరలయం నందు ఉన్న కొలనులో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మృతి..మృత దేహలను గుర్తించిన పోలీసులు..పిచ్చటూరు మండలం అడవి కోడియం బేడు గ్రామానికి చెందిన విజయ్,మహేంద్రనగా గుర్తించిన పోలీసులు
* నూజండ్ల మండలం ఐనఓలు సమిపంలోని గుళ్లకమ్మ వాగులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్ల, రెండు బుల్ డోజర్లను పట్టుకున్న ఐనఓలు పోలీసులు.
* ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి సమిపంలో ఒక వ్యక్తి ని పెట్రోలు పోసి హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు, మృతుడు ఎవరనేది తెలియాల్సి ఉంది.
* నాగార్జున యూనివర్సిటీ దగ్గర దశవతార వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.యూనివర్సిటీ వద్ద పవన్ ప్రోగ్రాంలో జేబు దొంగల హల్ చల్ పలువురి జేబులు ఖాళీ.లబో దిబో మంటున్న భక్తులు, సాక్షాత్తు గుడి నిర్వాహకుల 25000 నగదు దొగిలించిన దొంగలు.
* అమెరికా కాలిఫోర్నియాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బేకర్ ఫీల్డ్ ప్రాంతంలోని ఓ కారు డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ముందు కొన్ని కార్లలో చెలరేగిన మంటలు.. క్షణాల్లో పక్కనున్న కార్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 86 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ప్రాంతంలో పొగలు దట్టంగా వ్యాపించాయి. వెంటనే స్పాట్‌కు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి కారణమేంటనే దానిపై కాలిఫోర్నియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
*పాట్నాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. కాలిబాట పై నిద్రిస్తున్న వారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాతిరి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.
* తాడికొండ మండలం తాతిరెడ్డి పాలెంలో కుటుంబకలహాల నేపధ్యంలో ఈ రోజు తెల్లవారుజామున షేక్ అల్లాబి చెవి కోసిన భర్త బాజి. క్షతగాత్రురాలిని ఆసుపత్రికి తరలింపు.
* జోగులాంబ గద్వాల జిల్లాలోని బోరవేల్లిలో విషాదం చోటు చేసుకున్నది. పాము కాటుతో నవ వదువు లత మృతి చెందింది. 3 రోజుల క్రితమే లత పెళ్లి జరిగింది. కాళ్లకు పెట్టుకున్న పారాణి కూడా ఆరకముందే లత పాము కాటుతో మృతి చెందడంతో ఆమె కుటుంబంలో, గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. గతరాత్రి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో ఆమెను పాము కాటు వేయడంతో అక్కడికక్కడి మృతి చెందింది.
* ఉలవపాడులోని భారతీయ స్టేట్ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. చిన్నమంటలతో ప్రారంభమై క్యాబిన్ మొత్తం కాలి బూడిదయింది
* మాచర్ల 8వ వార్డులో వృద్ధురాలు బండి నాసరమ్మపై హత్యయత్నం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన నాసరమ్మను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని.. పరిశీలించికేసు నమోదు కేసి దర్యాప్తు చేపట్టారు.
* నల్లకుంటలోని రత్నానగర్‌లో గ్యాస్ సిలిండర్ పేలింది. బీజేపీ నాయకుడు లక్ష్మణ్ గౌడ్ ఇంట్లో ఈ తెల్లవారుజామున సిలిండర్ పేలడంతో ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పేలుడు సంభవించిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసింది. సంఘటనా స్థలాన్ని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పరిశీలించారు.
* తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ నందు రాజస్థాని యువకుడి పై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. యువకుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వ్యాపార లావాదేవీలే ఈ దాడికి కారణంగా తెలుస్తుంది.
* నెల్లూరుచిట్టీ పాటల పేరుతో అమాయకుల నుంచి డబ్బు వసూల చేసి రూ.2 కోట్లకు కుచ్చుటోపి పెట్టిన మహిళపై కేసు నమోదైంది. ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలో విజయమ్మ అనే మహిళ చిట్టీల పేరుతో రూ.2కోట్లకు కుచ్చుటోపి పెట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళను మోసం చేసి తీసుకువచ్చి లాడ్జ్‌లో ఉంచి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి కొత్తపేట ప్రాంతానికి చెందిన నర్సింహమూర్తి(41) ఆ ప్రాంతంలోఉన్న పలువురిని దుబాయ్‌కు పంపాడు. ట్రావెల్ ఏజెంట్‌గా ఆ ప్రాంతంలో అందరికీ పరిచితుడు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి (30) తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, తనకు దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పించమని కోరింది.
*కర్ణాటకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బీదర్ జిల్లాలోని బసవ కల్యాణ తాలూకా చిల్లాగల్లి గ్రామంలో ఇంటి పైకప్పు కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
*కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరువలోని దొడ్డబళ్లాపురలో తలదాచుకున్న అనుమానిత తీవ్రవాది హబీబుల్లాను జాతీయ భద్రతాదళం అధికారులు మంగళవారం అరెస్టు చేశారు.
*సహకార సంఘాలను పర్యవేక్షించాల్సిన విశాఖపట్నం డివిజినల్ సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ బోయిన మోషా (55) మంగళవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా)కు చిక్కారు.
*పదో తరగతి చదువుతున్న ఓ బాలికపై అయిదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఒడిశాలోని కేంఝర్ జిల్లా జోడా ప్రాంతంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
*అసభ్యంగా ప్రవర్తించిన ఓ దుర్మార్గుడిని నిలదీయడమే ఆ ఇద్దరు మహిళలు చేసిన పాపమైపోయింది. కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి వారిద్దరిపైకి కారు ఎక్కించి హతమార్చాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది.
*కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కేశవపట్నం ఆదర్శ పాఠశాల బాలికల వసతిగృహంలో ఆహారం వికటించి..పలువురు అస్వస్థతకు గురయ్యారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో, మంగళవారం అధికారులు కరీంనగర్, హుజూరాబాద్ ఆస్పత్రులకు తరలించారు.
*వేడి కూరలో పడి ఔరంగబాద్‌లో ఓ బాలుడు మృతి చెందాడు. ఔరంగబాద్ చికల్ఠాణా ప్రాంతంలోని పుష్పక్ గార్డన్ సమీపంలో సంతోష్ గాధు కుటుంబం నివాసముంటుంది. సోమవారం రాత్రి భోజనం చేసేందుకు సిద్ధం చేస్తుండగా సంతోష్ కుమారుడు హర్షల్ (3) ఆడుకుంటూ వచ్చి అక్కడే పెట్టిన కూర పాత్రలో పడిపోయాడు. వేడిగా ఉండటంతో ముఖమంతా కాలిపోయింది. తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు.
*రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి మూడు నిండు ప్రాణాలు బలైపోయాయి. తూర్పు కోస్తా రైల్వేలోని కొరాపుట్-రాయగడ మార్గంలో విద్యుదీకరణ పనుల్ని ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్ (ఓహెచ్ఈ) రైలులో (టవర్ కార్లో) సిబ్బంది పరీక్షిస్తున్న సమయంలో అదేమార్గంలో వచ్చిన హావ్‌డా- జగదల్పూర్ సమలేశ్వరి ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ఓహెచ్ఈ సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.
*గుంటూరు జిల్లా మంగళగిరిలో హత్య జరిగింది.తెదేపా నాయకుడు తాడిబోయిన ఉమాయాదవ్(42) మంగళవారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. తన ఇంటికి సమీపంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి హతమార్చారు.
*ఉద్యోగం విషయంలో తలెత్తిన వివాదంతో దాయాది.. ఓ గ్రామ రెవెన్యూ సహాయకుడి (వీఆర్ఏ)ని నరికి చంపిన సంఘటన మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలో చోటు చేసుకుంది.
*టీవీ షోలో ప్రసారమవుతున్న పాత్రను అభినయిస్తూ ఓ బాలిక ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఛాత్రపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇండియన్ ఆర్మీకి అమ్మాయిల ఎర-నేరవార్తలు–06/26
Related tags :