మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు మార్చి 27వ తేదీ చాలా ఘనంగా జరిగాయి. నిన్నటితో రామ్ చరణ్ 38వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఈ ఏడాది రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను కుటుంబ సభ్యులు అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహించారు. త్రిబుల్ ఆర్ సినిమా ఘనవిజయం సాధించటంతో రామ్ చరణ్ కి పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు లభించింది.అంతేకాకుండా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంతో ప్రపంచవ్యాప్తంగా చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
ఆస్కార్ గెలిచిన తర్వాత చరణ్ జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు వేడుకను మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో ఎంతో ఘనంగా నిర్వహించాడు. దీంతో ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా నిన్న రాత్రి రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో పాల్గొని సందడి చేశారు. ఈ బర్త్డే పార్టీలో ఉపాసన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఎందుకంటే గత కొంతకాలంగా ఉపాసన తల్లి కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఉపాసన తన బేబీ బంప్ కనిపించకుండా కవర్ చేయటంతో ఈ వార్తల గురించి అందరికీ అనుమానాలు ఉండేవి. అయితే నిన్న జరిగిన ఈ వేడుకల్లో ఉపాసన బేబీ బంప్ క్లియర్‌గా దర్శనం ఇచ్చింది.
అందరికీ క్లారిటీ ఇచ్చిన ఉపాసన…
ఉపాసన, రాంచరణ్ తల్లిదండ్రులు కాబోతున్నారని చిరంజీవి ప్రకటించడంతో అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. అయితే ఉపాసనది సహజ గర్భం కాదని,సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారంటూ రూమర్లు తెరపైకి వచ్చాయి. అంతే కాకుండా ఉపాసన బేబీ బంప్ సరిగ్గా కనిపించకపోవడంతో ఈ రూమర్లే నిజమని అంతా అనుకున్నారు. అలాగే ఉపాసన గర్భంతో ఉన్నప్పటికీ విదేశాలలో సందడి చేయటంతో అందరి అనుమానం మరింత బలపడింది. ఇక ఇప్పుడు ఇలా బేబీ బంప్‌తో క్లియర్‌గా కనిపించే సరికి అందరి అనుమానాలు పటాపంచలు అయ్యాయి. తొందర్లోనే మెగా కుటుంబానికి వారసుడు రాబోతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో బేబీ బంప్ తో ఉన్న ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.