ఎంత సేపూ చర్మాన్ని సౌందర్య దృష్టితోనే చూస్తాం కానీ, అనేకానేక వైరస్ బ్యాక్టీరియాల నుంచి ఇంకెన్నో ఇక్కట్లనుంచి శరీరాన్ని రక్షించడంలో అది ఎంతో కీలక పాత్రనే పోషిస్తుంది. శరీర ఆరోగ్యాన్ని ధ్వంసం చేసే సమస్త సూక్ష్మ జీవుల నుంచి కాపాడటంలో అడ్డుగోడగా నిలిచే చర్మం సహజంగానే ఎంతో శక్తివంతమైనది. అయితే చర్మం ఆ పాత్రను సమర్థవంతంగా పోషించడానికి దానికి విటమిన్-ఎ సమృద్ధిగా అందాలి. కణజాల బంధాన్ని నిలబెట్టడానికి అవసరమైన అంశాల్ని ఉత్పత్తి చే యడంలో విటమిన్- ఎ అత్యంత ప్రధాన భూమికను